నాంపల్లి కోర్టుకు వచ్చిన అల్లు అర్జున్

Allu Arjun: సినీ నటుడు అల్లు అర్జున్ శనివారం హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి కోర్టుకు వచ్చిన అల్లు అర్జున్.. సంతకం చేసిన బెయిల్ పూచీకత్తు పత్రాలు న్యాయమూర్తికి అందజేశారు. అనంతరం అక్కడ్నుంచి నేరుగా తన నివాసానికి వెళ్లిపోయారు. కోర్టుకు అల్లు అర్జున్ వచ్చినట్లు తెలియడంతో భారీగా అభిమానులు అక్కడికి చేరుకున్నారు. పలువురు అతనితో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. అయితే, పోలీసులు వారిని వారించారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు శుక్రవారం షరతులతో కూడిన రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. రూ. 50 వేలు చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేసింది.

Allu Arjun submits bail bond documents in Nampally court

రెండు నెలలపాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని షరతు విధించింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ శనివారం నాంపల్లి కోర్టుకు వచ్చి పూచీకత్తు పత్రాలు సమర్పించారు.

కాగా, పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. అనంతరం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఒకరోజు తర్వాత అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు.

అయితే, నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో అల్లు అర్జున్ వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. అదే రోజు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు రెగ్యూలర్ బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు శుక్రవారం సాయంత్రం బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు విచారణకు హాజరుకావాలని అల్లు అర్జున్‌ను ఆదేశించింది.

కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. తొక్కిసలాటలో తీవ్రగాయాలపాలైన ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు క్రమంగా కోలుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాగా, రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ రూ. కోటి, దర్శకుడు సుకుమార్ రూ. 50 లక్షలు, పుష్ప2 నిర్మాతలు రూ. 50 లక్షలు సాయం అందజేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+