వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీపీఎం మహసభల్లో ప్రత్యామ్నాయ రాజకీయాలపై చర్చ: బీవీ రాఘవులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ విధానాలపై సీపీఎం జాతీయ మహసభల్లో చర్చిస్తామని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘువులు చెప్పారు. భవిష్యత్‌లో దేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై మహసభల్లో చర్చించి నిర్ణయం తీసుకొంటామని ఆయన ప్రకటించారు.బహిరంగ సభ చివరి రోజున సరూర్‌నగర్ ఇండోర్‌స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఏప్రిల్ 18 నుండి 22 వ తేది వరకు సీపీఎం జాతీయ మహసభలు హైద్రాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఆదివారం నాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలపై చర్చించనున్నట్టు రాఘవులు చెప్పారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి సుమారు 764 మంది ప్రతినిధులు ఈ మహసభలకు హజరుకానున్నట్టు రాఘవులు తెలిపారు. ఈ మహసభల్లోపలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నట్టు ఆయన తెలిపారు.

alternative policies in national politics will be discussed: BV Raghavulu

దేశ ప్రయోజనాలను నీతి ఆయోగ్ పట్టించుకోవడం లేదని రాఘవులు విమర్శించారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఏ రకమైన వ్యూహన్ని అనుసరించాలనే దానిపై పార్టీ మహసభల్లో చర్చిస్తామని చెప్పారు.

దేశంలోని అన్ని రాష్ట్రాలకు పార్టీ విస్తరణ చేసే అంశంపై చర్చించనున్నట్టు చెప్పారు. మరో వైపు అదే సమయంలో బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో పార్టీ ఓటమి పాలు కావడం వంలి అంశాలపై కూడ దృష్టి పెడతామన్నారు.

రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో కలిసి పనిచేస్తామని బీవి రాఘవులు చెప్పారు. మూడు రోజుల మహసభల తర్వాత చివరి రోజున కొత్త కార్యవర్గాన్ని మహసభలు ఎన్నుకొంటాయని రాఘవులు ప్రకటించారు.

మహసభల చివరి రోజున సరూర్‌నగర్ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ బహిరంగ సభ కోసం పరేడ్ గ్రౌండ్‌ను ఇవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసినట్టు ఆయన చెప్పారు. అయితే రాజకీయ కారణాలతోనే తమ సభకు అనుమతి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.

పార్టీ మహసభల ప్రారంభం సందర్భంగా ఐదు వామపక్ష పార్టీలకు చెందిన జాతీయ కార్యదర్శులు వస్తున్నారని రాఘవులు చెప్పారు. వామపక్ష పార్టీల విలీనం గురించి ఈ మహసభల్లో చర్చ జరిగే అవకాశం లేదన్నారు.యూనివర్శిటీలను బిజెపి కాషాయీకరణ చేస్తోందని బీవీ రాఘవులు విమర్శించారు. ఒకేసారి జమిలి ఎన్నికలు ఫెడరల్ స్పూర్తికి విఘాతమని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
CPM Politburo member BV Raghavulu said that the alternative policies in national politics will be discussed in national conference held at Hyderabad from April 18 to 22.He spoke to media on Sunday at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X