తెలంగాణలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా..: అమిత్ షా సంచలన ప్రకటన: ఆట మొదలు..!!
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections 2023) వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఎన్నికల ప్రచార జోరు పెరుగుతోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్తోన్నాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. రాజెవరు? బంటు ఎవరు? అనేది తేలిది అప్పుడే.

వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అధికార భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కేసీఆర్ సుడిగాలి పర్యటలను చేస్తోన్నారు. నేడు ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజా ఆశీర్వాద సభ పేరుతో పాలేరు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
అటు కాంగ్రెస్, బీజేపీ.. తమ ప్రచార కార్యక్రమాలను తీవ్రతరం చేశాయి. బస్సు యాత్రలను నిర్వహిస్తోంది కాంగ్రెస్. ఇప్పటికే తొలి విడత బస్సు యాత్ర పూర్తయింది. శనివారం నుంచి రెండో విడత బస్సు యాత్ర మొదలు కానుంది. దీనికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పార్టీ సీనియర్లు ఇందులో పాల్గొననున్నారు.
ఈ పరిస్థితుల్లో బీజేపీ తరఫున రంగంలోకి దిగారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. సూర్యాపేట్‌లో బహిరంగ సభలో పాల్గొన్నారు. జన గర్జన పేరుతో ఈ సభను ఏర్పాటు చేశారు తెలంగాణ బీజేపీ నాయకులు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్, కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్ సహా పలువురు నేతలు ఇందులో పాల్గొన్నారు.

అమిత్ షా చేసిన హిందీ ప్రసంగాన్ని.. కిషన్ రెడ్డి తెలుగులోకి అనువదించారు. ఈ సందర్భంగా అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే- వెనుకబడిన వర్గాలకు పట్టం కడతామని ప్రకటించారు. తమ ప్రభుత్వం ఏర్పాటైతే బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిగా చేస్తామని తేల్చి చెప్పారు. బీసీల సంక్షేమానికి కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
ఈ దేశానికి బీసీలే వెన్నెముక అని అభివర్ణించారు అమిత్ షా. బీసీల కోసం ఇప్పటికే అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్నామని గుర్తు చేశారు. వారికి రాజ్యాంగబద్ధమైన అన్ని హక్కులనూ కల్పిస్తామని స్పష్టం చేశారు. దీన్ని కూడా తాము చిత్తశుద్ధితో అమలు చేస్తామనీ చెప్పారు.
ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మితమౌతోన్న రామాలయం గురించీ తన ప్రసంగంలో ప్రస్తావించారు అమిత్ షా. శ్రీరామచంద్రుడు 550 సంవత్సరాల పాటు ఓ చిన్న డేరాలో నివసించారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం శ్రీరాముడికి అద్భుత ఆలయాన్ని నిర్మిస్తోందని, జనవరి 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారని అన్నారు.
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications