ఎస్టీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కాపాడేది బీజేపీనే: రేవంత్‌లా ఏడవనంటూ అమిత్ షా కౌంటర్
హైదరాబాద్: రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ తమపై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆదివారంనాడు తెలంగాణ రాష్ట్రంలోని కాగజ్‌నగర్ తోపాటు సికింద్రాబాద్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
తన మాటలు వక్రీకరించి ఫేక్ వీడియో సృష్టించారని విమర్శించారు. ఫేక్ వీడియో వ్యవహారంలో పోలీసులు నోటీసులిచ్చారంటూ రేవంత్ రెడ్డి ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. తనపై రేవంత్ రెడ్డి కేసులు పెట్టారని.. అయితే, తాను రేవంత్‌లా ఏడవనని.. కోర్టును ఆశ్రయిస్తానని అమిత్ షా కౌంటర్ ఇచ్చారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను బీజేపీ కాపాడుతుందని అమిత్ షా స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ అవినీతి చేసేదని.. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోందని.. ఆర్ఆర్ అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ట్యాక్స్ అని వ్యాఖ్యానించారు.

రేవంత్ తెలంగాణను కాంగ్రెస్ కు ఏటీఎంలా మార్చారన్నారు. తెలంగాణలో పసుపు రైతుల కోసం బోర్డు ఏర్పాటు చేశామన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమని అమిత్ షా అన్నారు. మత ప్రాదికన రిజర్వేషన్లు ఇవ్వకూడదని రాజ్యాంగం చెప్పిందన్నారు. ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని కేంద్రమంత్రి ఆరోపించారు.
కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో రెండు విడతల పోలింగ్ ముగిసిందని.. తొలి రెండు విడతల్లో బీజేపీ సెంచరీ కొడుతుందన్నారు. తెలంగాణలో కొన్నేళ్లుగా బీజేపీకి ఓట్ల శాతం పెరుగుతోందన్నారు. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో పదికిపైగా ఎంపీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
The Modi government has an unmatched record of providing equal development opportunities to the Scheduled Tribes. Telangana is determined to re-elect Modi Ji to ensure uninterrupted development.
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) May 5, 2024
Addressed an enormous rally in Adilabad, Telangana. pic.twitter.com/lyt8NwxcIM
పండగలను కూడా సైనికుల మధ్య జరుపుకునే ప్రధాని మోడీ ఓ వైపు.. సెలవుల కోసం బ్యాంకాక్ టూర్లు వేసే రాహుల్ బాబా మరోవైపు ఉన్నారని అమిత్ షా అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా మోడీ మోడీ అనే నినాదాలే వినిపిస్తున్నాయన్నారు. 70 ఏళ్లుగా అయోధ్య రామమందిరం నిర్మాణం జరగకుండా కాంగ్రెస్ అఢ్డుకుందని మండిపడ్డారు. రెండోసారి ప్రధాని మోడీ వచ్చాకే రామమందిరం ప్రతిష్ఠ జరిగిందని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ ను ఆహ్వానించినా వారు.. తమ ఓటు బ్యాంక్ పోతుందని భయపడి రాలేదన్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!












Click it and Unblock the Notifications