అమీత్ షా సభ విజయవంతం చేయాలి.!పార్టీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు.!
హైదరాబాద్ : కేంద్ర హోం మంత్రి అమీత్ షా ముఖ్య అతిధిగా పాల్గొన బోతున్న చేవెళ్ల విజయ సంకల్ప సభ ఓ సంచలనం కావాలన్నారు తెలంగాణ బీజేపి అద్యక్షుడు బండి సంజయ్. తెలంగాణలో బీజేపీ గెలుపు తథ్యమనే సంకేతాలను ప్రజలకు పంపేందుకు ఈ వేదికను ఉపయోగించుకోవాలన్నారు. లక్ష మందికి తగ్గకుండా జన సమీకరణ జరగాలని, ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధపడుతున్నారని బండి తెలిపారు. సభకు వచ్చే వారికి తగిన ఏర్పాట్లు చేసి బహిరంగ సభకు తీసుకురావాలని క్యాడర్ సంకేతాలిచ్చిరు బండి సంజయ్.
చేవెళ్ల విజయ సంకల్ప సభ విజయవంతం చేయాలి...
ఈ నూపథ్యంలో జిల్లా అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర నేతలతో టెలి కాన్ఫరెన్స్ లో బండి సంజయ్ మాట్లాడారు. ఆదివారం చేవెళ్లలో జరగబోయే విజయ సంకల్ప సభ తెలంగాణలో సంచలనం కావాలనం కావాలని బీజేపీ నేతలకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో నిర్వహిస్తున్న ఈ సభకు లక్ష మందికి తగ్గకుండా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని, కార్యకర్తలంతా స్వచ్ఛందంగా ఈ సభకు హాజరై విజయవంతం చేయాలన్నారు. తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమనే సంకేతాలను ఈ సభ ద్వారా పంపాలని బండి సంజయ్ కుమార్ అన్నారు.

శనివారం జిల్లా అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన బండి సంజయ్ ఆదివారం చేవెళ్లలో జరగబోయే బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్న నేపథ్యంలో సభ విజయవంతానికి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త క్రుషి చేయాలని కోరారు. పార్లమెంట్ పరిధిలో జరగబోయే తొలి సభను సక్సెస్ చేయడం ద్వారా తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమనే నమ్మకాన్ని జాతీయ నాయకత్వానికి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణలో అవినీతి పాలనకు తెర దించాలి..
రాష్ట్రంలో నియంత, నిక్రుష్ణ, అవినీతి పాలన కొనసాగుతోందని, సీఎం చంద్రశేఖర్ రావు వల్ల కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలంతా బీజేపీ పట్ల నమ్మకంతో ఉన్నారని, ఈ నేపథ్యంలో పార్టీని అణిచివేసేందుకు సీఎం చంద్రశేఖర్ రావు రాబోయే రోజుల్లో కార్యకర్తలను మరింత ఇబ్బందికి గురిచేసే ప్రమాదం ఉందని, అయినా ప్రజలు, పార్టీ అండగా ఉన్నందుకు కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదన్నారు బండి సంజయ్ కుమార్.

తెలంగాణలో రాబోయేది బీజేపి ప్రకభుత్వమే..
కేంద్రంలో నరేంద్రమోదీ ఆధ్వర్యంలో అవినీతిరహిత పాలన కొనసాగుతోందని, తెలంగాణలోనూ అలాంటి పాలనే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. చేవెళ్ల సభ ద్వారా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, రామరాజ్య స్థాపన తథ్యమనే సంకేతాలను పంపబోతున్నట్లు చెప్పారు. ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ ప్రతి ఒక్కరూ మీడియా, సోషల్ మీడియా వేదికగా విస్త్రత ప్రచారం చేపట్టాలని బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications