బీజేపీ ఆపరేషన్ తెలంగాణ - రంగంలోకి అమిత్ షా..!!

తెలంగాణ కేంద్రంగా బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలను సిద్దం చేస్తోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు తెలంగాణలో వరుస పర్య టనలు చేస్తున్నారు. గ్రేటర్, ఖైరతాబాద్ ఉప ఎన్నికతో పాటుగా పంచాయితీ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ బీజేపీ నాయకత్వం కొత్త ప్రణాళిలతో బరిలోకి దిగుతోంది. అందులో భాగంగా నేరు గా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఆసక్తిగా మారుతోంది.

 తెలంగాణ BJPకి కొత్త సారధి- ఆయనకే పగ్గాలు, హైకమాండ్ బిగ్ ప్లాన్..!?
తెలంగాణ BJPకి కొత్త సారధి- ఆయనకే పగ్గాలు, హైకమాండ్ బిగ్ ప్లాన్..!?

తెలంగాణలో బీజేపీ ఈ సారి కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబర్ 4న తెలంగాణలో పర్యటించనున్నారు. అమిత్ షా పర్యటన కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా భవిష్యత్ వ్యూహాలకు కీలకంగా మారుతోంది.

Amit Shah s Telangana Visit on October 4 Gains Political Significance here the report

కాంగ్రెస్ - బీఆర్ఎస్ లక్ష్యంగా అమిత్ షా తెలంగాణలో పార్టీ నేతలకు ఇప్పటికే దిశా నిర్దేశం చేసారు. కేంద్ర మంత్రులు తరచూ తెలంగాణలో పర్యటిస్తూ... ప్రత్యేకంగా తటస్థులతో మమేకం కావాలని పార్టీ ఆదేశించింది. కాగా, తెలంగాణలో పార్టీ కార్యాచరణ పైన ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, రాష్ట్ర నాయకత్వానికి ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.

ఏపీ, తెలంగాణ బీజేపీ కొత్త ఇంఛార్జ్ లు- పురందేశ్వరి, డీకే అరుణకు కీలక పదవులు..!!
ఏపీ, తెలంగాణ బీజేపీ కొత్త ఇంఛార్జ్ లు- పురందేశ్వరి, డీకే అరుణకు కీలక పదవులు..!!

తెలంగాణలో ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవడానికి "సడక్ సే సదన్ తక్" కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో అమిత్ షా కరీంనగర్, మెదక్ జిల్లాలలో పర్యటించనున్నారు. కరీంనగర్‌లోని ప్రతిమ కాలేజ్ లో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడమే ప్రధాన లక్ష్యంగా అమిత్ షా పర్యటన సాగనుందని పార్టీ నేతలు చెబుతున్నారు. అమిత్ షా పర్యటన ద్వారా పార్టీ క్యాడర్‌లో జోష్ నింపాలని, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని వ్యూహం సిద్దం చేస్తున్నారు. దీంతో, అమిత్ షా పర్యటన పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+