ఏపీ, తెలంగాణ బీజేపీ కొత్త ఇంఛార్జ్ లు- పురందేశ్వరి, డీకే అరుణకు కీలక పదవులు..!!
బీజేపీ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల పైన ఫోకస్ చేసింది. కొత్త వ్యూహాలను సిద్దం చేస్తోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లతో పాటుగా డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం కసరత్తు కొనసాగిస్తోంది. ఇదే సమయం లో కేబినెట్ ప్రక్షాళన దిశగానూ మంత్రాంగం నడుస్తోంది. అయితే.. పలు రాష్ట్రాలకు ఇంఛార్జ్ లను బీజేపీ నాయకత్వం మార్పు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ కీలక నిర్ణయం తీసుకుంది.
బీజేపీ కేంద్ర నాయకత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. పార్టీ జాతీయ కమిటీ ప్రకటన తరువాత ఇప్పుడు కొత్త ఇంఛార్జ్ లను ప్రకటించింది. త్వరలో కేంద్ర కేబినెట్ ప్రక్షాళన దిశగా కసరత్తు చేస్తోంది. ఎన్డీఏలోకి కొత్త మిత్రులు.. పార్టీల మద్దతుతో మహిళా రిజర్వేషన్.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి వచ్చే నెల ముహూర్తం ఫిక్స్ చేసింది. కాగా.. మంత్రులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న ప్రధాని మోదీ కీలక దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇక.. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ను పరిగణలోకి తీసుకొని పలు రాష్ట్రాలకు బీజేపీ కొత్త ఇంఛార్జ్ లను నియమించింది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోనూ మార్పులు చేసింది. ఏపీకి అరవింద్ భదౌరియా నియమించగా... తెలంగాణకు సునీల్ బన్సల్ ను కొనసాగించాలని నిర్ణయించింది.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కొత్త పార్టీ ఇన్‌చార్జులు, సహ ఇన్‌చార్జులను నియమించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ నియామకాలను చేపట్టారు. తాజా నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్ పార్టీ ఇన్‌చార్జిగా డా. అరవింద్ భదౌరియాను, సహ ఇన్‌చార్జిగా వనతి శ్రీనివాసన్‌ను నియమించారు. అదే విధంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జిగా సునీల్ బన్సల్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు అభయ్ పాటిల్, రేఖా శర్మను సహ ఇన్‌చార్జులుగా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఏపీ.. తెలంగాణ నుంచి ఎంపీలుగా ఉన్న ఇద్దరు మహిళా నేతలు పురందేశ్వరికి ఒడిశా ఇంఛార్జ్ బాధ్యతలు కేటాయించారు. డీకే అరుణకు తమిళ నాడు సహ ఇంఛార్జ్ గా బాధ్యతలు కేటాయించారు.














Click it and Unblock the Notifications
