వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆమ్నీషియా పబ్ రగడ: వక్ఫ్ బోర్డు చైర్మన్ కు రాజీనామా చెయ్యాలన్న టీఆర్ఎస్; చెయ్యనన్న మసీవుల్లా!!

|
Google Oneindia TeluguNews

జూబ్లీ హిల్స్ ఆమ్నీషియా పబ్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటన తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. జూబ్లీహిల్స్ లో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఈ గ్యాంగ్ రేప్ ఘటనలో పలువురు రాజకీయ నాయకుల కుమారులు ఉండడంతో ఇది తెలంగాణ రాష్ట్రంలో దుమారంగా మారింది.

వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చెయ్యాలని టీఆర్ఎస్ ఆదేశం

వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చెయ్యాలని టీఆర్ఎస్ ఆదేశం

టిఆర్ఎస్ పార్టీపై ఈ నేపథ్యంలో తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. దీంతో జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర సమితి వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ మసీవుల్లా ఖాన్‌ను ఆదేశించినట్లు తెలుస్తుంది. కానీ రాజీనామా చేసే ప్రసక్తే లేదని వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీవుల్లాఖాన్ తేల్చి చెబుతున్నారు. వక్ఫ్ యొక్క కఠినమైన నిబంధనలను ఉటంకిస్తూ తన పదవికి రాజీనామా చేయడానికి మసీవుల్లా ఖాన్ నిరాకరించారు.

రాజీనామా చెయ్యనంటున్న వక్ఫ్ బోర్డ్ చైర్మన్, రంగంలోకి హోం మంత్రి

రాజీనామా చెయ్యనంటున్న వక్ఫ్ బోర్డ్ చైర్మన్, రంగంలోకి హోం మంత్రి

తనను పదవి నుంచి ఎవరూ తప్పించలేరని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజీనామా చేసేది లేదని ఆయన అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్‌ అలీ జోక్యం చేసుకుని మసీవుల్లా ఖాన్ తన పదవికి రాజీనామా చేసేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో ఏ వన్ నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ మాలిక్ ను పోలీసులు నాలుగు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు.

అత్యాచార ఘటనలో పోలీస్ కస్టడీలో నిందితుడు చెప్పే వివరాలు కేసులో కీలకం కానున్నాయి. ఇక ఈ మేరకు ఈ రోజు చంచల్ గూడా జైలుకు చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, అక్కడ వైద్య పరీక్షల అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ జరుపుతున్నారు.

రాజీనామా చేస్తారా .. లేదా? టీఆర్ఎస్ ఏం చెయ్యనుంది? ప్రశ్న

రాజీనామా చేస్తారా .. లేదా? టీఆర్ఎస్ ఏం చెయ్యనుంది? ప్రశ్న

టీఎస్‌ హజ్‌ కమిటీ చైర్మన్‌గా ఎండీ సలీమ్‌ నియమితులవడంతో ఇటీవల మసీవుల్లా ఖాన్ ఆ పదవికి నామినేట్‌ అయిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ మైనర్ గ్యాంగ్ రేప్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న క్రమంలో కుమారుడి లైంగిక వేధింపుల కేసును ఆరోపణలు ఎదుర్కొంటున్న వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీవుల్లా ఖాన్ తన పదవికి రాజీనామా చేయాల్సిందిగా టిఆర్ఎస్ పార్టీ హుకుం జారీ చేసినా, ససేమిరా అంటున్న ఆయన రాజీనామా చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఒకవేళ ఆయన రాజీనామా చేయడానికి విముఖతను వ్యక్తం చేస్తే టిఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతోంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

English summary
TRS has ordered the resignation of the chairman of the waqf board who is facing charges of having a son in the Amnesia Pub Minor gang rape case. However, Masiullah Khan is adamant that he will not.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X