వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తోట, రావెలపై పెద్ద బాధ్యత: కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన ఏపీ నేతలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ రాజకీయ నేతలు తోట చంద్రశేఖర్, రావెల కిశోర్ బాబు, చింతల పార్థసారథి, టీజే ప్రకాశ్, రమేష్ నాయుడు, గిద్దల శ్రీనివాస్, జేటీ రామారావు తోపాటు భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పలువురు కీలక నేతలకు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్.

తోట, రావెలపై పెద్ద బాధ్యత పెడతానంటూ కేసీఆర్

తోట, రావెలపై పెద్ద బాధ్యత పెడతానంటూ కేసీఆర్

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో మనదేశం వ్యవసాయానికి అనుకూలమైన దేశం. ప్రపంచంలోనే మంచి ఆహార పదార్థాలను పండించే దేశం. దేశంలో వ్యవసాయం ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. యాపిల్ నుంచి మామిడికాయలు పండుతాయన్నారు. ఒకప్పుడు రాజకీయాలంటే త్యాగమని అన్నారు కేసీఆర్. తోట, రావెలపై పెద్ద బాధ్యత పెట్టబోతున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. రావెలను తనతోపాటు జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళతానని చెప్పారు. ఏపీ బాధ్యతలు తోటకు అప్పగించినట్లు చెప్పారు.

బీఆర్ఎస్ అంటే తమాషా కాదన్న కేసీఆర్

బీఆర్ఎస్ అంటే తమాషా కాదన్న కేసీఆర్

మనదేశంలో లక్ష కోట్ల పామియిల్ దిగుమతి చేసుకుంటున్నాం.
కందిపప్పు కూడా దిగుమతి చేసుకుంటున్నాం. ఈ దుస్థితి పోవాలి.
బీఆర్ఎస్ అంటే తమాషా కోసం కాదు. ఓ మూలన ఉండడానికి కాదు. ఒక రాష్ట్రం కోసం కాదు. బీఆర్ఎస్ ఇండియా కోసమే. లక్ష కిలోమీటర్ల ప్రయాణమైనా చేస్తా అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ అందుకేనంటూ కేసీఆర్

బీఆర్ఎస్ అందుకేనంటూ కేసీఆర్

నీళ్లు ఉంటాయి.. పొలాలకు నీరు రావు. విద్యుత్ సౌకర్యం ఉంటది. ఇళ్లకు రాదు. అందరికీ స్వాతంత్ర్యం ఫలం అందాలి. గుణాత్మకమైన మార్పు రావాల్సి ఉంది. మహోజ్వల అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఏదైనా మొదలుపెట్టినప్పుడు ఎవరూ గుర్తించరని.. కానీ చివరకు విజయం మనదేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. శిక్షణ తరగుతులు ఉంటాయన్నారు. బీఆర్ఎస్ ఎందుకోసమో చెబుతామన్నారు కేసీఆర్. ఇప్పుడు ఏం చేసైనా అధికారమే లక్ష్యంగా కొన్ని పార్టీలు పనిచేస్తున్నాయన్నారు. మతాలు, కులాల కుంపట్లు పెడుతున్నారు. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యం అయ్యింది. రాజకీయ లక్ష్యం ఇదేనా? రైతులు, దళితులు సమస్యలు ఎదుర్కొంటున్నారని కేసీఆర్ చెప్పారు. ఎమ్మెల్యే అయితేనే కొందరు భాష, వేషం మార్చి వ్యవహరిస్తున్నారన్నారు. అభివృద్ధి ఫలాలు సమాజంలో అందరికీ అందాలన్నారు.

ఇండియా రియాక్ట్ అవుతుందన్న కేసీఆర్


మేకిన్ ఇండియా ఎక్కడ? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికీ ప్రతి గ్రామంలో చైనా బజార్ లు ఉన్నాయన్నారు. పిల్లల బొమ్మలు కూడా దిగుమతి చేసుకుంటున్నామన్నారు. ఏం అభివృద్ధి సాధించామని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వంద శాతం ఫలితాలు తీసుకొస్తామన్నారు. బీఆర్ఎస్ ఎజెండాను భారత్ చెబుతామన్నారు.
దేశంలో పుష్కలంగా నీటి వనరులున్నా వినియోగించుకోవడం లేదని అన్నారు. బ్యాడ్ వాటర్ పాలసీ, బ్యాడ్ పవర్ పాలసీల కారణంగానే దేశంలో నీరు, విద్యుత్ కొరత ఉందన్నారు. తెలంగాణలో తాము 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ అన్నారు. మనం సరైన విధంగా ప్రజలకు చెప్పగలిగితే.. ఇండియా రియాక్ట్ అవుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

English summary
andhra pradesh political leaders joins brs on the presence of kcr.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X