నోయిడాలో తెలుగు విద్యార్ధిని కాల్చి చంపిన స్నేహితులు
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్న అమిత్ యూనివర్సిటీలో ఓ తెలుగు విద్యార్ధి దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితులే అతడిని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. మృతుడు నల్గొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన సందేశ్ భాస్కర్ (23)గా గుర్తించారు. సందేశ్ భాస్కర్ నోయిడాలోని అమిత్ యూనివర్సిటీలో బీఎస్సీ మెరైన్ సైన్స్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
స్ధానిక అపార్ట్‌మెంట్‌లో తన మిత్రులైన నదీమ్, మధుర్‌తో కలిసి ఉంటున్నాడు. శనివారం సాయంత్రం 4.30 నిమిషాలకు అమన్ అనే విద్యార్థి సందేశ్ రూమ్‌కు వచ్చి బెల్ గొట్టాడు. ఆ సమయంలో రూమ్‌లో సందేశ్ ఒక్కడే ఉన్నాడు. తలుపు తీసిన సందేశ్‌పై అమన్ ఒక్కసారిగా దాడికి దిగాడు.

దీంతో వీరిద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఈ పెనుగులాటలో అమన్ తనతో పాటు తెచ్చుకున్న గన్‌తో సందేశ్‌ను అత్యంత దారుణంగా కాల్చి చంపాడు. దీంతో సందేశ్ అక్కడిక్కడే మృతి చెందాడు. సందేశ్ హత్యకు కారణం విద్యార్ధుల మధ్య ఉన్ గ్రూపు తగాదాలే కారణమని తెలుస్తోంది.
అమన్ అదే యూనివర్సిటీలో టూరిజం విద్యార్ధిగా పోలీసులు గుర్తించారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సందేశ్ కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై యూనివర్సిటీ అధికారులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications