హైదరాబాద్‌లో బోర్డు తిప్పేసిన మరో ఐటీ కంపెనీ.. రోడ్డెక్కిన 400 మంది !!

హైదరాబాద్ ఐటీ హబ్ మాదాపూర్‌లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. 'NSN ఇన్ఫోటెక్' పేరుతో నకిలీ కంపెనీని నెలకొల్పి.. నిరుద్యోగులకు శిక్షణ, ఉద్యోగం హామీ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి రాత్రికిరాత్రి పరారయ్యాడు. మొత్తం 400 మందికి పైగా విద్యార్థులు ఈ మోసానికి బలయ్యారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

కాగా గత కొన్ని నెలలుగా మాదాపూర్‌లోని ఓ కమర్షియల్ భవనంలో 'NSN ఇన్ఫోటెక్' ఆఫీస్‌ను ఏర్పాటు చేశారు. ఐటీ కంపెనీలా కనిపించేలా ఇంటీరియర్, సిబ్బంది, క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. సంస్థ డైరెక్టర్‌ స్వామినాయుడు అందరితో నమ్మకంగా ప్రవర్తిస్తూ వచ్చారు. ఫుల్‌స్టాక్ డెవలప్‌మెంట్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి హై-డిమాండ్ కోర్సులకు శిక్షణ ఇస్తామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. శిక్షణ తరువాత తమ కంపెనీలోనే ఉద్యోగం ఇస్తామని ప్రత్యేక హామీ ఇచ్చారు. ఈ నమ్మకంతో ఒక్కో విద్యార్థి నుంచి రూ. 2.5-3 లక్షల వరకు ఫీజులు వసూలు చేశారు. మొత్తం 400 మంది విద్యార్థుల నుంచి సుమారు రూ. 10-12 కోట్ల వరకు సేకరించారని సమాచారం.

another-fake-company-nsn-infotech-collected-crores-of-rupees-and-absconded

బోర్డు తిప్పేసి రాత్రికిరాత్రే పరార్..

అయితే ఈరోజు ( నవంబర్ 26, 2025 ) తరగతులకు వచ్చిన విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. కంపెనీ బోర్డు తీసేసి ఆఫీసు తలుపులకు తాళాలు వేసి ఉండడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఏ ఒక్కరు కనబడకపోవడం.. స్వామినాయుడు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం.. వాట్సాప్ గ్రూపులూ డిలీట్ కావడంతో ఎం చేయాలో తెలియని అయోమయంలో ఉండిపోయారు. అంతే కాకుండా కార్యాలయంలో ఉన్న సిస్టమ్‌లు, డేటా కూడా మాయమైనట్టు చెబుతున్నారు. అంతా సందేహంలో ఉన్న సమయంలో భవనం యజమాని "అద్దె కూడా చెల్లించలేదు... అందుకే లాక్ వేశాం" అని చెప్పటంతో అసలు మోసం బయటపడింది.

స్వామినాయుడు కుటుంబంతో సహా పరారీ..

ఈ ఘరానా మోసం వెనుక మాస్టర్ మైండ్ స్వామినాయుడు తన భార్య, తదితర కీలక సభ్యులతో కలిసి గల్లంతయ్యాడు. వారి మొబైల్ నంబర్లు, అడ్రస్‌లు, అన్ని ఆచూకీలు లేకుండా పోయాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబరాబాద్ పోలీసులు వారి బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలు, రిజిస్ట్రేషన్ పత్రాలపై దర్యాప్తు ప్రారంభించారు.

మాదాపూర్-గచ్చిబౌలి పరిసరాల్లో ఇదే తరహా మోసాలు తరచుగా బయటపడుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. గచ్చిబౌలిలో ప్యూరోపాల్ క్రియేషన్ అండ్ ఐటీ సొల్యూషన్స్ మోసం ఘటన ఈ ఏడాది మేలో జరగగా.. 200 మందికి ఉద్యోగం పేరుతో ఒక్కోరి నుంచి రూ. 3 లక్షలు తీసుకుని బోర్డు తిప్పేసింది. అప్పులు తీసుకుని, బంగారం అమ్మి, కుటుంబాల ఆశలతో కోర్సుల్లో చేరిన విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవితాలను నమ్మకంతో పెట్టుబడి పెట్టాం... ఇప్పుడు పూర్తిగా ముంచేశారని కన్నీటి పర్యంతం అవుతున్నారు.

ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు నిరుద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు. రిజిస్ట్రేషన్ లేని కంపెనీలకు డబ్బులు చెల్లించవద్దని.. ప్లేస్‌మెంట్ హామీ అంటే వెంటనే అప్రమత్తం అవ్వాలని కోరారు. పెద్ద మొత్తంలో ఫీజులు అడిగితే తమకు తెలియజేయాలని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+