వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ నివేదికతో సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరో లేఖ.. ఎందుకంటే!!

|
Google Oneindia TeluguNews

పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి స్థలం కేటాయించాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోమారు సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రామగుండంలో వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి అనువైన స్థలాన్ని కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

ముదురుతున్న ఈడీదాడుల వ్యాఖ్యల రచ్చ: ట్విట్టర్ టిల్లు కేటీఆర్.. మళ్ళీ బాంబుపేల్చిన బండి సంజయ్ముదురుతున్న ఈడీదాడుల వ్యాఖ్యల రచ్చ: ట్విట్టర్ టిల్లు కేటీఆర్.. మళ్ళీ బాంబుపేల్చిన బండి సంజయ్

 రామగుండం ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన భూమి అనుకూలంగా లేదు : కిషన్ రెడ్డి

రామగుండం ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన భూమి అనుకూలంగా లేదు : కిషన్ రెడ్డి


ఈ లేఖలో మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తామని చెప్పిన ప్రస్తుత భూమి ఆస్పత్రి నిర్మాణానికి అనువుగా లేదని మండిపడ్డారు. ఈ భూమి పై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను లేఖ తో పాటు సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి పంపించారు. రామగుండం శివారులో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి ఐదు ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. అయితే ఆ భూమిపై ఈఎస్ఐ అధికారులు, నిపుణులు సర్వే నిర్వహించారు.

 గతంలో మున్సిపాలిటీ డంప్ యార్డుగా భూమి, పక్కనే స్మశానాలు .. నిపుణుల కమిటీ నివేదిక

గతంలో మున్సిపాలిటీ డంప్ యార్డుగా భూమి, పక్కనే స్మశానాలు .. నిపుణుల కమిటీ నివేదిక


ఈ నేపథ్యంలో సదరు భూమి గతంలో మునిసిపాలిటీ డంపింగ్ యార్డ్ గా ఉపయోగించారని గుర్తించినట్లు తెలిసింది. ఇక ఆసుపత్రికి కేటాయించిన భూమి పక్కనే 2 స్మశాన వాటికలు కూడా ఉన్నట్టు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఆసుపత్రికి చేరుకోవడానికి నేరుగా దారి కూడా లేదని నిపుణుల నివేదికలో స్పష్టం చేశారని కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ కు తెలియజేశారు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ కు కూడా ఆ స్థలం చాలా దూరంగా ఉందని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ స్థలాన్ని సూచించాలని కిషన్ రెడ్డి కోరారు.

 గతంలో స్థలం కేటాయించాలని లేఖ రాసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

గతంలో స్థలం కేటాయించాలని లేఖ రాసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి


గతంలోనూ ఈఎస్ఐ ఆస్పత్రి విషయంలో సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన కిషన్ రెడ్డి తెలంగాణ కార్మికుల పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఎస్ ఐ ఆసుపత్రి సేవల విస్తరణకు కేంద్ర కార్మిక శాఖ అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. 2018లో రామగుండంలో 100 పడకల ఆధునిక ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని, కార్పొరేషన్ కేంద్ర కార్యాలయం 2018 సెప్టెంబర్ 20న రాష్ట్ర ప్రభుత్వానికి ఐదెకరాల స్థలం కేటాయించాలని లేఖ రాసిందని పేర్కొన్నారు.

 కిషన్ రెడ్డి లేఖతో భూమి కేటాయింపు.. కానీ స్థలం ఇలా ఉందంటూ కిషన్ రెడ్డి లేఖ

కిషన్ రెడ్డి లేఖతో భూమి కేటాయింపు.. కానీ స్థలం ఇలా ఉందంటూ కిషన్ రెడ్డి లేఖ


భూమి కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని ఆయన అన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదని, ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో జాప్యంపై ఇటీవల మంత్రివర్గ సమావేశంలో చర్చించామని ఆయన ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించి భూకేటాయింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి ఐదు ఎకరాల భూమిని కేటాయించింది. అయితే అది ఆసుపత్రి నిర్మాణానికి ఏ విధంగానూ అనుకూలంగా లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోమారు కెసిఆర్ కు లేఖ రాశారు.

English summary
Another letter from union minister Kishan Reddy to CM KCR on allotment of ESI hospital place in ramagundam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X