కెసిఆర్‌తో భేటీ: కుటుంబ సమేతంగా రావాలని చంద్రబాబు ఆహ్వానం

హైదరాబాద్: ఈ నెల 22వ తేదీన జరిగే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు కుటుంబ సమేతంగా రావాలని ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆహ్వానించారు. ఆయన ఆదివారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో కెసిఆర్‌ను కలిశారు. ఇరువురి మధ్య దాదాపు 50 నిమిషాల పాటు భేటీ జరిగింది.

చంద్రబాబును కెసిఆర్ సాదరంగా ఆహ్వానించి లోనికి తీసుకుని వెళ్లారు. అమరావతి శంకుస్థాపనకు వెళ్లే విషయంపై కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. ఆ కార్యక్రమానికి వెళ్తేనే బాగుంటుందని మెజారిటీ నాయకులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

KCR - Chandrababu

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య చర్చ సాగినట్లు తెలుస్తోంది. రాజధాని కార్యకలాపాలకు ఎన్ని ఎకరాలు కేటాయించారని కెసిఆర్ చంద్రబాబును అడిగారు. 500 ఎకరాలు కేటాయించినట్లు చంద్రబాబు చెప్పారు. వేయి ఎకరాలు అయితే బాగుంటుందని కెసిఆర్ అన్నట్లు సమాచారం తమకు కూడా అలాగే అనిపిస్తోందని చంద్రబాబు అన్నట్లు చెబుతున్నారు. కెసిఆర్‌కు చంద్రబాబు ఆహ్వాన పత్రంతో పాటు తిరుపతి లడ్డూ ప్రసాదం కూడా అందించారు.

అమరావతి శంకుస్థాపనకు రావాలనే ఉందని, అయితే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని కెసిఆర్ చంద్రబాబుతో చెప్పినట్లు సమాచారం. ఈ నెల 21వ తేదీన నల్లగొండ జిల్లా సూర్యాపేటకు వెళ్లి, మర్నాడు అమరావతికి రావాలనే ఆలోచన ఉన్నట్లు కెసిఆర్ చంద్రబాబుతో చెప్పినట్లు తెలుస్తోంది. నదుల అనుసంధానంపై కూడా ఇరువురు ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మరోసారి సమావేశమై వివరంగా చర్చించుకుందామని వారు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Chandrababu - KCR

కెసిఆర్ కూడా అమరావతికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను అదే రోజున హైదరాబాదులో ప్రారంభించవలసి ఉంది. అయితే, చంద్రబాబు స్వయంగా వచ్చి ఆహ్వానించినందున కెసిఆర్ వెళ్లవచ్చునని తెలుస్తోంది. ఇందుకు డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసుకోనున్నారని తెలుస్తోంది.

చంద్రబాబు వెంట టి. టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు ఉన్నారు. కెసిఆర్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు కెటి రామారావు, జగదీష్ రెడ్డి తదితరులు ఉన్నారు. దాదాపు 8 నెలల తర్వాత చంద్రబాబు, కెసిఆర్ ముఖాముఖి కలుసుకున్నారు.

కెసిఆర్‌తో భేటీ తర్వాత చంద్రబాబు గవర్నర్ నరసింహన్‌ను అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించడానికి రాజభవన్ బయలుదేరి వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+