చెప్పారు కానీ.. బాబుకు మోడీ షాక్: మోత్కుపల్లికి గవర్నర్ ఛాన్స్ లేనట్లే?
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మిత్రపక్షం బిజెపి షాకిచ్చిందని చెప్పవచ్చు.
హైదరాబాద్/అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మిత్రపక్షం బిజెపి షాకిచ్చిందని చెప్పవచ్చు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి వస్తుందని ఎప్పటి నుంచో భావిస్తున్నారు. కానీ శనివారం నాటి జాబితాలో ఆయన పేరు లేదు.

ఐదు రాష్ట్రాల గవర్నర్లు వీరే
ఐదు రాష్ట్రాలకు, అండమన్ నికోబార్ దీవులకు లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. తమిళనాడుకు భన్వరిలాల్ పురోహిత్, మేఘాలయకు గంగాప్రసాద్, అరుణాచల్ ప్రదేశ్‌కు బీడీ మిశ్రా, బీహార్‌కు సత్యపాల్ మాలిక్, అసోంకు జగదీశ్ ముఖీలను గవర్నర్లుగా, అండమాన్ నికోబర్ దీవులకు దేవేంద్ర కుమార్ జోషిని లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు.

మోత్కుపల్లికి దక్కలేదు, బాబు అసంతృప్తి
మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి వస్తుందని చాలా కాలంగా భావిస్తున్నారు. తనకు ఎప్పుడు గవర్నర్ పదవి వస్తుందా అని మోత్కుపల్లి కూడా వేచి చూస్తున్నారు. శనివారం గవర్నర్ల జాబితాలో ఆయన పేరు లేకపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబుకు అసంతృప్తిని కలిగించిందని తెలుస్తోంది.

చంద్రబాబుకు కూడా చెప్పారు కానీ
మరో ఆసక్తికర విషయం ఏమంటే.. మోత్కుపల్లికి గవర్నర్ పదవి వస్తుందని చంద్రబాబుకు సూచనాప్రాయంగా అందిందని తెలుస్తోంది. కానీ ఆయన పేరు లేకపోవడం టిడిపిని అసంతృప్తికి గురి చేసిందని తెలుస్తోంది.

ఓ సీనియర్ నేత ప్రకారం..
మోత్కుపల్లి నర్సింహులు పేరు కొత్త గవర్నర్ల జాబితాలో ఉందని బిజెపి పెద్దల నుంచి టిడిపికి స్పష్టమైన సమాచారం ఉందని ఓ సీనియర్ నేత అంటున్నారట. మోత్కుపల్లి పేరు ఉందని, ప్రకటన రావాల్సి ఉందని చెప్పారట. కానీ శనివారం నాటి లిస్టులో మోత్కుపల్లి పేరు లేకపోవడంతో ఆశ్చర్యపోయామని, తమకు ఇది ఆందోళన కలిగించే విషయమేనని టిడిపి అంటోంది.

మోత్కుపల్లి కోసం బాబు ప్రయత్నాలు
మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి ఇప్పించేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. ప్రధాని మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు ఏడాదిన్నర క్రితమే ఈ విషయం చెప్పారు. అంతేకాదు మోత్కుపల్లిని వారి వద్దకు తీసుకు వెళ్లి పరిచయం చేశారు. ఇటీవల కేంద్రమంత్రి వెంకయ్య హైదరాబాదులో పర్యటించినప్పుడు మోత్కుపల్లికి మంచి పదవి వస్తుందని వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు నిరాశే ఎదురయింది.

మోత్కుపల్లికి ఛాన్స్ లేనట్లేనా?
పరిస్థితిని బట్టి చూస్తుంటే మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఛాన్స్ ఇక లేనట్లేననే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాలకు గవర్నర్లను నియమించినట్లయింది. ఇక గవర్నర్లను సొంత రాష్ట్రాలకు పంపించరు. కాబట్టి మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఛాన్స్ ఇప్పటికైతే మిస్ అయినట్లేనని అంటున్నారు. ప్రస్తుతానికి సరైన వారు దొరికే వరకు నరసింహన్ తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా ఉండనున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications