ఏపీలో మద్యం షాపులకు రీనోటిఫికేషన్..19 వరకు దరఖాస్తులు, 21న లాటరీ

ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మద్యం షాపుల కేటాయింపుకు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఏపీలో రెన్యువల్ చేసుకోగా మిగిలిపోయిన 271 మద్యం షాపుల కేటాయింపుకు మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 3,652కు పైగా షాపులు ఉండగా, 2,929 షాపులు రెన్యువల్ అయ్యాయి. మిగిలిన వాటిలో మొదటి విడత లాటరీలో కొన్ని కేటాయించిన తర్వాత 271 షాపులు ఖాళీగా ఉన్నాయి.

వీటిలో 267 సాధారణ కేటగిరీ, నాలుగు కల్లుగీత కులాలకు రిజర్వు చేసినవి ఉన్నాయి.ఈ మద్యం షాపుల కేటాయింపుకు ఆసక్తి ఉన్న వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఏపీ ఎక్సైజ్ శాఖ. ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 19 అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో షాపుకు రూ.3 లక్షల నాన్-రిఫండబుల్ దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

AP liquor shops Excise Department Invites Fresh Applications for 271 Liquor Shops apply by oct 19th Draw on October 21

అక్టోబర్ 20న దరఖాస్తులు పరిశీలించి, 21న ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో లాటరీ నిర్వహిస్తారు. ఎంపికైనవారికి అదే రోజు సమాచారం అందుతుంది. జిల్లాల వారీగా చూస్తే కడపలో 33, నెల్లూరులో 24, గుంటూరు, తిరుపతిలో 19 చొప్పున, పశ్చిమగోదావరిలో 17, ప్రకాశంలో 16 షాపులు ఎక్కువగా ఉన్నాయి.

అనంతపురం జిల్లాలో 15 షాపులు , అనకాపల్లి లో 13 షాపులు , కృష్ణా జిల్లాల్లో 13 షాపులు, పల్నాడు జిల్లాలో 12 షాపులు, బాపట్ల జిల్లాలో 12 షాపులు, మార్కాపురం జిల్లాలో 11 షాపులు, శ్రీకాకుళ జిల్లాలో 10 ఇలా పెద్ద సంఖ్యలోనే ఖాళీ షాపులు ఉన్నాయి. కొత్త మద్యం విధానం ప్రకారం లైసెన్స్ రెన్యువల్ చేసుకోవటానికి అవకాశం ఇచ్చిన ఏపీ సర్కార్, లైసెన్స్ ఫీజులో 38 శాతాన్ని రెన్యువల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ గా చెల్లించిన వారికి రెన్యువల్ చేసింది.

కేబీఆర్ పార్క్ ఎలివేటేడ్ కారిడార్ కోసం కోట్ల విలువైన ఇంటి స్థలం ఇస్తున్న బాలకృష్ణ!
కేబీఆర్ పార్క్ ఎలివేటేడ్ కారిడార్ కోసం కోట్ల విలువైన ఇంటి స్థలం ఇస్తున్న బాలకృష్ణ!

రెన్యువల్ చార్జీలు, దరఖాస్తు ఫీజుల ద్వారా ప్రభుత్వానికి ఇప్పటికే రూ.817 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ 271 షాపుల కేటాయింపు పూర్తయితే మరికొంత ఆదాయం రావచ్చు. రీ నోటిఫికేషన్ ఇచ్చినట్టు చెప్పి, దరఖాస్తులను ఆహ్వానిస్తున్న క్రమంలో ఎక్సైజ్ కమిషనర్ సీహెచ్ శ్రీధర్ పారదర్శకంగా ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. అర్హులైనవారు గడువు లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+