సౌదీ అరేబియా ఆయువుపట్టుపై భీకర దాడి: ఎయిర్‌పోర్ట్‌లపై వరుస దాడులు
సౌదీ అరేబియాలోని పౌర విమానాశ్రయాలే లక్ష్యంగా యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు తమ దాడులను తీవ్రతరం చేశారు. రాజధాని రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుస క్షిపణి దాడులు జరిగిన మరుసటి రోజే, ఆ దేశ తూర్పు ప్రావిన్స్‌లోని దమ్మామ్‌లో ఉన్న కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను హౌతీలు లక్ష్యంగా చేసుకున్నారు. మిస్సైళ్లను సంధించారు. డ్రోన్లతో దాడులకు తెగబడ్డారు.
ఈ హఠాత్ పరిణామంతో సౌదీ అరేబియా వ్యాప్తంగా విమానయాన భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దాడుల పరిధి రాజధాని రియాద్ దాటి ఇతర నగరాలకు విస్తరించడం.. అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఆదివారం సాయంత్రం దమ్మామ్ విమానాశ్రయంపై దాడి జరిగినట్లు సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారికంగా ధృవీకరించింది. ఈ ఘటనలో ఎయిర్ పోర్ట్ టెర్మినల్స్, పరిసర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

రియాద్‌కు ఈశాన్యంగా 410 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ దమ్మామ్ సిటీ. సౌదీ అరేబియా చమురు, సహజ వాయువు ఉత్పత్తికి ప్రధాన కేంద్రం. అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ సిటీ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. సౌదీలో మెజారిటీ ముడిచమురు, సహజవాయు శుద్ధి కేంద్రాలు ఇక్కడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హౌతీలు ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ దాడి.. సౌదీ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
పౌర విమానాశ్రయాలు, ఆయిల్ లాజిస్టిక్ కేంద్రాలపై దాడులు పెరగడం అంతర్జాతీయంగా ఆందోళనకు కారణమౌతోంది. ఇప్పటికే రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయం స్తంభించిపోయింది. ఇప్పుడు దమ్మామ్ కూడా లక్ష్యంగా మారడంతో గల్ఫ్ ప్రాంతంలో వైమానిక రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఈ పరిణామాలు గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న మిలియన్ల మంది విదేశీ కార్మికుల భద్రతను, ప్రాంతీయ ఆర్థిక రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
DESPITE SAUDI ARABIA‘S COUNTEROFFENSIVE ATTACKING YEMENI CIVILIAN AREAS AND THEIR AIRPORT, THE HOUTHIS ARE UNRELENTINGPowerful explosions rocked King Fahd Airport in #Dammam Reuters, citing witnesses: More than 10 ambulances headed towards #Riyadh Airport and evacuation of passengers.
— Tomthunkit™ (@TomthunkitsMind) October 11, 2026
ఈ దాడుల అనంతరం హౌతీ సైనిక ప్రతినిధి యహ్యా సరి టెలివిజన్ ద్వారా సందేశం విడుదల చేశారు. ఈ వరుస దాడులకు తామే బాధ్యత వహిస్తోన్నట్లు ప్రకటించారు. సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలు ఇకపై ఎంత మాత్రం కూడా సురక్షితం కాదని, విమాన సంస్థలు, ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది.. సౌదీ వైమానిక కేంద్రాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. యెమెన్‌లో సౌదీ అరేబియా చేపట్టిన సైనిక చర్యలు నిలిపివేయకపోతే రాబోయే రోజుల్లో మరింత తీవ్రమైన దాడులు ఉంటాయని స్పష్టం చేశారు.
యెమెన్ ఎర్రసముద్ర తీరప్రాంతాల్లో హౌతీలు వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం వల్ల సౌదీ అరేబియా ఈ సైనిక చర్యలను చేపట్టాల్సొచ్చింది. రాజధాని సనా, సాదా వంటి హౌతీ స్థావరాలపై సౌదీ కూటమి బలగాలు 24 గంటల్లో 124 వైమానిక దాడులు జరిపినట్లు హౌతీలు వెల్లడించారు. తమపై జరుగుతున్న సైనిక చర్యలకు ప్రతిస్పందనగానే, సౌదీ అరేబియాకు చెందిన కీలక మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని తాము ఈ ప్రతిదాడులు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications
