మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు - ఏ వర్గానికి ఏ సీటు, లిస్టు..!!
ఏపీలో స్థానిక ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. రెండు రోజుల్లో ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదలకు సిద్దమైంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. రిజర్వేషన్ల ఖరారు పైన అధికారులు జాబితా సిద్దం చేసారు. తుది పరిశీలన తరువాత అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. బీసీల రిజర్వేషన్ల పైనా ఉత్తర్వులు రావటంతో.. తాజా రిజర్వేషన్లతో ఏ సీటు ఎవరికి దక్కుతుందనే స్పష్టత వస్తోంది. దీంతో, పార్టీలు అభ్యర్ధులను ఖరారు చేస్తున్నాయి.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్ల పైన అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. ఈ సాయంత్రం అధికారికంగా జాబితా విడుదల చేయనున్నారు. 17 నగరపాలక సంస్థలు, 106 పురపాలక సంఘాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల వారీగా కేటాయించే స్థానాలపై నిర్ణయం పూర్తయింది. జనాభా నిష్పత్తి, రొటేషన్ తదితర అంశాల ఆధారంగా వీటిని ఖరారు చేసారు. ఈ నెల 14న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. దీంతో, ఈ రోజు నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల వారీగా రిజర్వేషన్ల జాబితాను విడుదల చేయనున్నారు. కాగా.. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ మేయర్ పదవిని ఎస్టీలకు, రాజమహేంద్రవరం, కర్నూలు నగరపాలక సంస్థలను ఎస్సీలకు కేటాయించి నట్లు తెలుస్తోంది.123 పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 41 కేటాయించనున్నట్లు తెలిసింది. మొత్తం 17 నగరపాలక సంస్థల్లో బీసీలకు 5, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 దక్కనున్నాయి. మహిళలు 50 శాతం కంటే ఎక్కువగా అంటే 9 మంది మేయర్లు కానున్నారు.

రిజర్వేషన్లు- అభ్యర్దుల పై కసరత్తు
అదే విధంగా 106 పురపాలక సంఘాల్లో బీసీలకు 36, ఎస్సీలకు 14, ఎస్టీలకు 3 కేటాయిస్తు న్నట్లు తెలుస్తోంది. ఇందులో 50 శాతం చోట్ల మహిళలకు ఛైర్‌పర్సన్ పదవులు దక్కనున్నాయి. నగరపాలక సంస్థల్లో నాలుగు చోట్ల మహిళలకే అవకాశం కల్పించనున్నారు. మచిలీపట్నం, కాకినాడ, కార్పొరేషన్లను 2021 ఎన్నికల్లో జనరల్ మహిళలకు కేటాయించారు. ఈ దఫా కూడా బీసీ మహిళలకు అవకాశం దక్కనుంది. 2021 ఎన్నికల్లో బీసీ మహిళలకు కేటాయించిన విజయనగరం, శ్రీకాకుళం కార్పొరేషన్లను జనరల్ మహిళలకు కేటాయించనున్నారు. ఎస్టీ (1) - జనరల్ : మంగళగిరి, ఎస్సీ (2) - మహిళ: కర్నూలు, జనరల్: రాజమహేంద్రవరం, బీసీ (5) - మహిళలు: మచిలీపట్నం, కాకినాడ, జనరల్: చిత్తూరు, అనంతపురం, ఏలూరు, మహిళలు (5) - జనరల్: శ్రీకాకుళం, విజయనగరం, వైఎస్సార్ కడప, గుంటూరు, కడప, గ్రేటర్ విశాఖపట్నం ఉన్నాయి. అదే విధంగా అన్‌రిజర్వ్‌డ్ (4) కేటాయించారు. అందులో ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ ఉన్నట్లు సమాచారం. ఇక 106 మున్సిపాల్టీల్లో ఎస్టీ-3, ఎస్సీ: 14, బీసీ 36, జనరల్ మహిళ - 27, అన్ రిజర్వ్‌డ్ -26 గా ఖరారు చేసారు. తుది పరిశీలన తరువాత అధికారికంగా జాబితా ప్రకటించేందుకు సమాయత్తం అవుతున్నారు.












Click it and Unblock the Notifications
