దారుణం: కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని నాలుక కోసుకున్న ఏపీ యువకుడు, దేవుడికి ముడుపు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. అతను తన నాలుకను తానే కోసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.
సదరు యువకుడికి కేసీఆర్ అంటే ఎంతో అభిమానం. అతను శ్రీనగర్ కాలనీ ప్రాంతంలో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ సీఎం కావాలని ఆయన కోరుకుంటున్నారు.

అతను బుధవారం సాయంత్రం శ్రీనగర్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లాడు. అక్కడ కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని చెబుతూ ముడుపుగా నాలుకను కోసుకొని దేవుడి హుండీలే వేశాడు. ఇది కలకలం రేపింది. దీంతో అతనిని హుటాహుటిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అతనికి చికిత్స అందించారు. అతని నాలుకకు కుట్లు పడ్డాయి.












Click it and Unblock the Notifications