బాబుకు చిరంజీవి థ్యాంక్స్: మీడియాపై దాడి, పవన్ కళ్యాణ్ సారీ (పిక్చర్స్)

హైదరాబాద్: అమరావతి రాజధాని శంకుస్థాపన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు పలువురు ముఖ్య నేతలకు శనివారం నాడు ఆహ్వాన పత్రికను అందించారు. మాజీ కేంద్రమంత్రి చిరంజీవి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు అందించారు.

చంద్రబాబుకు చిరంజీవి థ్యాంక్స్ చెప్పారు. శంకుస్థాపనకు తనను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. శనివారం సాయంత్రం ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు వెళ్లి చిరంజీవిని కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. శంకుస్థాపనకు వచ్చేందుకు ప్రయత్నిస్తానని మంత్రులకు చెప్పారు.

అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని తెలంగాణలో మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ఏపీ మంత్రులు అక్బరుద్దీన్‌ను వ్యక్తిగతంగా కలసి ఆహ్వానపత్రికను అందజేశారు. శంకుస్థాపనకు హాజరు కావాలని కోరారు.

రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాలంటూ తమిళనాడు గవర్నర్ రోశయ్యను కేంద్రమంత్రి సుజనా చౌదరి స్వయంగా కలసి ఆహ్వానించారు. రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యక్తి, తమిళనాడు గవర్నర్ రోశయ్యకు ఆహ్వాన పత్రాన్ని కొరియర్ ద్వారా పంపినట్లు తొలుత వార్తలు వెలువడ్డాయి. అయితే కేంద్రమంత్రి సుజనా చెన్నైలో రోశయ్యను స్వయంగా కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించారు.

దాడి

దాడి

మంత్రులు నానక్‌రాంగూడలో సినిమా నటుడు పవన్ కల్యాణ్‌ను కలిసి అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని కోరుతూ ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, అయ్యన్నపాత్రుడులు పవన్‌కల్యాణ్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామానాయుడు స్టూడియో దగ్గర సెక్యూరిటీ సిబ్బంది ఓవరాక్షన్‌ చేశారు. మీడియా సిబ్బందిని లోపలకు అనుమతించలేదు. దీంతో మీడియా ప్రతినిధులు, సెక్యూరిటీ సిబ్బంది మధ్య తోపులాట జరిగింది.

కెమెరామెన్ ధర్నా

కెమెరామెన్ ధర్నా

ఓ చానెల్‌ కెమెరామన్‌ కిందపడిపోయారు. ఈ సంఘటనకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పారు. ఇటువంటి సంఘటన జరిగినందుకు చింతిస్తున్నట్లు ఆయన తెలిపారు. సాధారణంగా మీడియాకు ఇబ్బంది కలిగించే పరిస్థితిని తాను కల్పించనని, అయితే అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రికలు ఇవ్వడానికి మంత్రులు వచ్చినప్పుడు మీడియా సిబ్బందిపై జరిగిన దాడికి క్షమాపణలు చెబుతున్నానని ఆయన అన్నారు.

చిరంజీవి

చిరంజీవి

ఆంధ్రప్రదేశ్ మంత్రులు కామినేని శ్రీనివాస్ రావు, అయ్యన్నపాత్రుడులు రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి ఆహ్వాన పత్రం ఇస్తున్న దృశ్యం.

పద్మాదేవేందర్ రెడ్డి

పద్మాదేవేందర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ మంత్రులు కామినేని శ్రీనివాస్ రావు, అయ్యన్నపాత్రుడులు తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి ఆహ్వాన పత్రం ఇస్తున్న దృశ్యం.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ మంత్రులు కామినేని శ్రీనివాస్ రావు, అయ్యన్నపాత్రుడులు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌కు ఆహ్వాన పత్రం ఇస్తున్న దృశ్యం.

ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ మంత్రులు కామినేని శ్రీనివాస్ రావు, అయ్యన్నపాత్రుడులు తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆహ్వాన పత్రం ఇస్తున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+