ఏపీ టూ తెలంగాణా: కొబ్బరి బొండాల మాటున గంజాయి స్మగ్లింగ్; ఉపసర్పంచ్ ముఠా అరెస్ట్!!
కొబ్బరి బొండాల మాటున గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఉప సర్పంచ్ ముఠాను వరంగల్ కమీషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కొబ్బరి బొండాల మాటున గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఉప సర్పంచ్ ముఠాను వరంగల్ కమీషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా నీరుకుళ్ల గ్రామ ఉప సర్పంచ్ ముసిక లక్ష్మణ్ తోపాటు ఈజీగా డబ్బు సంపాదించడానికి ఏపీ నుండి తెలంగాణ రాష్ట్రానికి గంజాయిని తెచ్చి దందాకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

ఏపీ టూ తెలంగాణా.. గంజాయి స్మగ్లింగ్ .. పట్టుకున్న పోలీసులు
విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు ఆత్మకూరు పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సోదాలలో ఏపీ నుండి తెలంగాణకు గంజాయి తెస్తున్న ఉప సర్పంచ్ గ్యాంగ్ పట్టుబడింది. వీరి నుండి 34 లక్షల రూపాయల విలువగల 170 కిలోల గంజాయిని, ఒక కారును, గంజాయి రవాణాకు వినియోగించిన ఒక బొలెరో వాహనాన్ని, మూడు సెల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈజీగా డబ్బు సంపాదన కోసం గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఉప సర్పంచ్ గ్యాంగ్
పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గోరుకొత్తపల్లి కి చెందిన రాయలేని శంకర్, ఆత్మకూరు మండలం వరంగల్ జిల్లా నీరుకుళ్ళ గ్రామానికి చెందిన ముసిక లక్ష్మణ్, ములుగు జిల్లా బండారుపల్లి కి చెందిన మహేష్, ములుగు పస్రా కు చెందిన సతీష్ ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఇక అరెస్టుకు సంబంధించి ఈస్ట్ జోన్ డిసిపి కరుణాకర్ వివరాలను వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో రాయినేని శంకర్, నీరుకుళ్ళ ఉప సర్పంచ్ ముసిక లక్ష్మణ్ తో కలిసి ఏపీ నుండి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఎక్కువ ధరకు ఇక్కడ విక్రయించాలని నిర్ణయించారు.
కొబ్బరి బొండాల క్రింద గంజాయి .. నిందితులు అరెస్ట్
ఇందులో భాగంగా నిందితులు ఏపీ లోని నర్సీపట్నంలో నూకరాజు అనే వ్యక్తి ద్వారా 170 కిలోల గంజాయిని కొనుగోలు చేసి, రెండు ప్యాకెట్ లో వాటిని ప్యాక్ చేసి దానిని కొబ్బరి బొండాల మాటున రహస్యంగా భద్రపరిచి వరంగల్ కు తరలించారు. ఇక ఈ బొలెరో వాహనానికి ఎస్కార్ట్ గా శంకర్, నీరుకుళ్ళ గ్రామ ఉపసర్పంచ్ లక్ష్మణ్ వ్యవహరించారు. వీరిద్దరికీ గంజాయి రవాణా చెయ్యటం కోసం మహేష్, సతీష్ లు సహాయం చేశారు. సమాచారం మేరకు పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీలలో సోదా చేసిన పోలీసులు కొబ్బరి బొండాల క్రింద రెండు ప్యాకెట్లలో గంజాయిని పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.












Click it and Unblock the Notifications