హైదరాబాద్ లో యాపిల్ సంస్థ భారీ విస్తరణ.. ఆ ప్రాంతంలో..
హైదరాబాద్ మహానగరం దినదినాభివృద్ధి దిశగా సాగుతోంది. ఫ్యూచర్ సిటీగా అంతర్జాతీయ స్థాయులో దూసుకెళ్తోంది. ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలతో భాగ్యనగరం పోటీ పడుతోంది. ఇక్కడి అనుకూలమైన వాతావరణం.. దిగ్గజ కంపెనీలకు అనువైన స్పాట్ గా మారుతోంది. హైదరాబాద్ లో అంతర్జాతీయ కంపెనీలు చాలానే ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, డెలాయిట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్, ఆపిల్, క్వాల్కమ్.. తదితర అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ తమ కార్యాలయాలను నెలకొల్పాయి. ఇక తాజాగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ను మరింతగా అభివృద్ధి చేసేందుకు పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. హైడ్రా, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు, ఆర్ఆర్ఆర్, ఫ్యూచర్ సిటీ.. తదితర నిర్ణయాలతో భాగ్యనగరాన్ని మరింత అభివృద్ది చేస్తోంది.
ఇక టెక్ దిగ్గజం యాపిల్ హైదరాబాద్ లో కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు నానక్ రామ్ గూడలోని వేవ్ రాక్ ఐటీ పార్క్ లో అదనంగా 57 వేల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకుంది. ఇందుకు గానూ ప్రతి నెలా సుమారు రూ. 71.67 లక్షల అద్దెను చెల్లించనుంది. ఐదేళ్ల కాలపరిమితి ఈ లీజు ఒప్పందం కుదుర్చుకుంది యాపిల్ సంస్థ. తాజా ఒప్పందంతో ఇప్పటికే నగరంలో ఉన్న యాపిల్ కార్యకలాపాలకు అదనపు బలాన్ని చేకూర్చడమే కాకుండా.. స్థానికంగా మరిన్ని ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశం ఉంది.

ఇక తాజాగా యాపిల్ సంస్థ అదనంగా 57 వేల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ను లీజుకు తీసుకోవడంతో ఈ సంస్థ మొత్తం కార్యాలయ విస్తీర్ణం సుమారు 6.34 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. గతేడాది ఇదే క్యాంపస్ లో 64 వేల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది యాపిల్ సంస్థ. తాజాగా రెండోసారి తన కార్యాలయాన్ని మరింత విస్తరించడం విశేషం. ఇక 2016 లో తొలిసారిగా యాపిల్ సంస్థ ప్రస్థానం హైదరాబాద్ లో ప్రారంభం అయింది. అప్పట్లో కేవలం 2.32 లక్షల చదరపు అడుగులతో యాపిల్ సంస్థ తన కార్యాలయాన్ని ప్రారంభించింది.












Click it and Unblock the Notifications