వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారా? రిక్రూట్మెంట్ బోర్డ్ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. జర భద్రం!!

|
Google Oneindia TeluguNews

పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎంతో కాలంగా నిరీక్షించి ఇప్పుడు పోలీస్ శాఖలో కొలువు కోసం తీవ్రంగా కష్టపడుతున్న నిరుద్యోగులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంది తెలంగాణా పోలీస్ శాఖ. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ పేరుతో నకిలీ వెబ్ సైట్ సృష్టించారని, రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు అని పేర్కొంటుంది.

పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ పేరుతో నకిలీ వెబ్ సైట్

పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ పేరుతో నకిలీ వెబ్ సైట్


తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కు సంబంధించి tslprb.co.in వెబ్ సైట్ ఉందని, ఇటీవల tslprb.co.in పేరుతో మరో వెబ్ సైట్ ప్రత్యక్షం అయిందని పేర్కొన్నారు పోలీసులు. గుర్తుతెలియని వ్యక్తులు నిరుద్యోగులను మోసం చేయడానికి తీసుకు వచ్చినట్లుగా గుర్తించిన డీజీపీ కార్యాలయం దీనిని తొలగించాలంటూ హైదరాబాద్ పోలీస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక దీనిపై ముమ్మరంగా దర్యాప్తు మొదలుపెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇది ఉద్యోగ ప్రకటనల కోసం ఏర్పాటు చేసిన ఒక యాప్ గా గుర్తించారు. ఆ వెబ్ సైట్ లోకి వెళ్ళగానే మరో కొత్త సైట్ తెరుచుకుంటుంది అని, పొరపాటున అందులోకి వెళితే జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు అభ్యర్థులకు సూచిస్తున్నారు.

సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్న పోలీసులు

సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్న పోలీసులు


నిరుద్యోగులారా నకిలీ వెబ్ సైట్లతో జర భద్రం అంటూ పోలీసులు దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అఫీషియల్ వెబ్ సైట్ ని గుర్తించి తద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని వరంగల్ కమిషనరేట్ పోలీసులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా అభ్యర్థులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు శాఖలో ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులు సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దని, జాగ్రత్తగా ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని సూచిస్తున్నారు.

గందరగోళంలో ఉద్యోగార్ధులు.. నకిలీ వెబ్ సైట్ తొలగించాలని విజ్ఞప్తి

గందరగోళంలో ఉద్యోగార్ధులు.. నకిలీ వెబ్ సైట్ తొలగించాలని విజ్ఞప్తి

ఇదిలా ఉంటే tslprb.co.in పేరుతో 2 వెబ్ సైట్లు ఉండడంవల్ల తాము గందరగోళానికి గురవుతున్నామని, నకిలీ వెబ్ సైట్ ను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉద్యోగార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏ మాత్రం తేడా లేకుండా రెండు వెబ్ సైట్లు ఒకే విధంగా ఉండటంతో పొరపాటుగా నకిలీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునే ప్రమాదం ఉందని, ఉద్యోగార్ధులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సదరు నకిలీ వెబ్ సైట్ లను తొలగించి సైబర్ క్రైమ్ పోలీసులు తమకు సహకరించాలని ఉద్యోగార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పోలీస్ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు .. బీ అలెర్ట్

పోలీస్ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు .. బీ అలెర్ట్

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖలోని అనేక విభాగాల్లో ఉన్న ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 25వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మే 2వ తేదీ నుండి మే 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 17,099 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో 587 ఎస్ఐ, 414 సివిల్ ఎస్సై లతోపాటు, 16 వేల 27 కానిస్టేబుల్, 66 ఏఆర్ ఎస్ ఐ, 5 రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. దరఖాస్తు విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

English summary
Cybercrime police, who have identified a fake website in the name of the Police Recruitment Board, are warning those applying for jobs in the police department to be wary of fake websites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X