బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్: వరంగల్ నుంచి పోటీకి ఛాన్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితి(BRS)కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒక్కొరుగా నేతలు పార్టీని వీడుతున్నారు. కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరితే.. మరికొందరు బీజేపీలో చేరుతున్నారు. తాజాగా, మరో బీజేపీ మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆదివారం బీజేపీ గూటికి చేరారు.

ఆరూరి రమేశ్‍‌కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రమేశ్.. శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాగా, బీఆర్ఎస్ పార్టీని వీడనున్నారనే ప్రచారం తర్వాత ఇటీవల మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ముఖ్య నేతలు ఆయనను కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు.

Aroori Ramesh joins bjp likely to get warangal mp seat

అంతేగాక, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లి సముదాయించినా ఫలితం లేకపోయింది. ఆరూరి రమేష్ బీజేపీ తరపున వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు బీజేపీ నుంచి ఆయనకు హామీ లభించినట్లు తెలిసింది. బీజేపీ ప్రకటించే వచ్చే జాబితాలో ఆరూరి పేరు రానున్నట్లు తెలుస్తోంది.

ఆరూరి రమేశ్ పార్టీలో చేరిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై మరోసారి స్పందించారు. కవిత అరెస్టు బీజేపీ పార్టీకి, ప్రభుత్వానికి గానీ వ్యకిగత సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏ కుటుంబనైనా, రాష్ట్రమైనా, బీజేపీ కార్యకర్తలైనా అవినీతి పరులైతే వదిలే ప్రసక్తే లేదని చెప్పారు.

'లిక్కర్ బిజినెస్‌​​తో బినామీ పేర్లతో వ్యాపారాలు చేసింది వాళ్లు. విమర్శలు మాత్రం బీజేపీ పైనా? కవిత పీఏలు గాని, బినామీలు అప్రూవర్‌​​గా మారి వివరాలు ఇస్తున్నారు. ఈడీ ఇండిపెండెంట్ సంస్థ దానికి అన్ని అధికారాలు ఉంటాయి' అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+