మామునూరు ఎయిర్ పోర్టుకు కొత్త పేరు సూచించిన ఓవైసీ-రేవంత్ కు లేఖ..!

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా మామునూరులో నిర్మిస్తున్న కొత్త ఎయిర్ పోర్టుకు ఏ పేరు పెట్టాలనే విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రతిపాదనలు ఆహ్వానించారు. దీంతో ప్రతీ రోజూ పలు కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే రాణి రుద్రమదేవి, పీవీ నరసింహారావు, చాకలి ఐలమ్మ, గోన గన్నారెడ్డితో పాటు పలువురు ప్రముఖుల పేర్లు ప్రభుత్వానికి అందాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) కూడా తన వైపు నుంచి మామునూరు ఎయిర్ పోర్టు (Mamnoor Airport) కు ఓ కొత్త పేరు సూచించారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి ఓ లేఖ రాశారు.

జనగణమన ప్రజల గీతం- ఆ పొరబాటు వల్లే వందేమాతరం- ఓవైసీ షాకింగ్..!
జనగణమన ప్రజల గీతం- ఆ పొరబాటు వల్లే వందేమాతరం- ఓవైసీ షాకింగ్..!

వరంగల్ లోని మామునూర్ విమానాశ్రయం హైదరాబాద్ నిజాం పాలనలో 1930లలో నిర్మించారని, ఇది భారతదేశంలోని పురాతన విమానాశ్రయాల్లో ఒకటని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. వరంగల్‌లోని పేపర్ పరిశ్రమతో పాటు ఆజం జాహీ మిల్స్ వంటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించారని గుర్తుచేశారు. తెలంగాణకు విమానాశ్రయానికి తగిన పేరును సూచించాలన్న రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు.. అవిభాజ్య వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, 1857 తిరుగుబాటు సమయంలో హైదరాబాద్‌లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ప్రతిఘటనతో అనుబంధం ఉన్న "మౌల్వీ సయ్యద్ అలావుద్దీన్" పేరును విమానాశ్రయానికి పెట్టాలని కోరారు.

Asaduddin Owaisi Seeks Mamnoor Airport to Be Named After Freedom Fighter Moulvi Syed Alauddin
బెంగాల్లో బీజేపీకి ఊహించని కొత్త ప్రత్యర్థి? టీఎంసీ, కాంగ్రెస్, లెఫ్ట్ బలహీనపడ్డ వేళ..!
బెంగాల్లో బీజేపీకి ఊహించని కొత్త ప్రత్యర్థి? టీఎంసీ, కాంగ్రెస్, లెఫ్ట్ బలహీనపడ్డ వేళ..!

మౌల్వీ సయ్యద్ అలావుద్దీన్, తుర్రెబాజ్ ఖాన్‌తో కలిసి 1857 జూలై 17న హైదరాబాద్‌లో బ్రిటిష్ రెసిడెన్సీకి వ్యతిరేకంగా జరిగిన చారిత్రక ప్రతిఘటనకు నాయకత్వం వహించారని ఓవైసీ తెలిపారు. అనంతరం ఆయనను అరెస్టు చేసి సికింద్రాబాద్‌లోని సెంట్రల్ జైలులో నిర్బంధించారన్నారు. దక్షిణ భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఆయన పాత్ర ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచిందన్నారు. మౌల్వీ సయ్యద్ అలావుద్దీన్ ధైర్యం, త్యాగానికి గుర్తుగా విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టడం సముచితమైన నివాళి అవుతుందన్నారు. అలాగే, పెద్దగా గుర్తింపు పొందని ఈ స్వాతంత్ర్య సమరయోధుడి వారసత్వాన్ని భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా చేయడానికి ఇది దోహదపడుతుందన్నారు. అందువల్ల పునరుద్ధరిస్తున్న మామునూర్ విమానాశ్రయానికి "మౌల్వీ సయ్యద్ అలావుద్దీన్ విమానాశ్రయం, వరంగల్" అని పేరు పెట్టే ప్రతిపాదనను దయచేసి పరిశీలించాలని రేవంత్ ను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+