Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నా భర్తపై పెట్రోల్ పోసి తగులబెట్టారు.. వాళ్లిద్దరిపై చర్యలేవీ?: హోంగార్డు రవీందర్ భార్య

హైదరాబాద్: హోంగార్డు రవీందర్‌పై ఏఎస్సై నర్సింగ్ రావు, కానిస్టేబుల్ చందు పెట్రోల్ పోసి తగులబెట్టారని ఆయన భార్య సంధ్య ఆరోపించారు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రవీందర్ ఫోన్‌ను అన్‌లాక్ చేసి డేటా డిలీ చేశారని.. ఇప్పటి వరకూ వాళ్లిద్దరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదని సంధ్య నిలదీశారు.

తన భర్తతో తాను మాట్లాడిన తర్వాతే చంపేశారని సంధ్య ఆరోపించారు. రవీందర్ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. తన భర్త 17 ఏళ్లుగా నిబద్ధతతో విధులు నిర్వహించారని అన్నారు. ఇందుకు బదులుగా సొంత పోలీసు శాఖలోని వారే తన భర్తకు కారణమయ్యారని మండిపడ్డారు. హోంగార్డు అధికారి హైమద్.. తన భర్తను దూషించడంతోపాటు అవమానించారని చెప్పారు.

ASI and constable killed my husband: home guard Ravinder wife Sandhya

రవీందర్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. అతడ్ని హత్య చేశారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సంధ్యతోపాటు కుటుంబసభ్యులు శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి ఉస్మానియా ఆస్పత్రి ఓపీ విభాగం వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. రవీందర్ భార్య ఆందోళనకు మరికొందరు హోంగార్డులు మద్దతు తెలిపారు.

ఈ క్రమంలో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సంధ్యతో చర్చించారు. ఉస్మానియాలో అత్యవసర వైద్య సేవలకు వచ్చేవారికి ఇబ్బంది అవుతోందని.. ఆందోళన విరమించాలని కోరినా ఆమె వెనక్కి తగ్గలేదు. మరోవైపు, రవీందర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఆమె అనుమతి కోరారు పోలీసులు. అయితే, రవీందర్ పై పెట్రోల్ పోసి తగులబెట్టాలని.. ఆ సీసీ ఫుటేజీ బయటపెట్టాలని సంధ్యతోపా ఆమె కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు.

ASI and constable killed my husband: home guard Ravinder wife Sandhya

మరోవైపు, ఆందోళన చేస్తున్న సంధ్య వద్దకు వచ్చి మద్దతు తెలిపారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వామపక్షాలు నేతలు కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్ రెడ్డి, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంధ్యతో మాట్లాడారు. రవీందర్ మృతికి కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రవీందర్ మరణంపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు రేవంత్ తెలిపారు. రవీందర్ కుటుంబం పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని మండిపడ్డారు. రవీందర్ విషయంలో పోలీసులు తీరు సరిగా లేదన్నారు. హోంగార్డు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రవీందర్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇది ఇలావుండగా, రవీందర్ మృతి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోంగార్డుల విషయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. హోంగార్డులు ఎవరూ రవీందర్ కుటుంబానికి మద్దతుగా వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. హోంగార్డులు అందరూ డ్యూటీలో ఉండేలా చూసుకోవాలని సీఐలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీలో లేని హోంగార్డులు కూడా తప్పనిసరిగా పోలీస్ స్టేషన్‌లో ఉండాలని ఆదేశించారు. ఎవరైనా విధులకు రాకపోకుండా ఆందోళనల్లో పాల్గొంటే డిస్మిస్ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఓ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+