ఆశ్చర్యం: అదే పనిగా నోట్లు విసిరేసిన ఏటీఎం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ ఏటీఎం నుంచి డబ్బులు అదే పనిగా రావడం ఓ కస్టమర్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సంఘటన సికింద్రాబాద్ స్టేషన్ వద్ద బుధవారం నాడు సాయంత్రం చోటు చేసుకుంది.
రైల్ నిలయం వద్ద ఏర్పాటు చేసిన ఏటీఎంలో డబ్బు డ్రా చేయడానికి బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి వచ్చాడు. రూ.ఆరు వేలు డ్రా చేద్దామనుకున్నాడు. ఏటీఎం కార్డును పెట్టి, పిన్ నెంబర్ టైప్ చేశాడు. తక్కువ మొత్తం డ్రా చేయాలని స్క్రీన్ పైన కనిపించింది.
ఆయన, తిరిగి ఐదు వేలు డ్రా చేసేందుకు ఉపక్రమించాడు. వెంటనే రూ.100 నోట్లు ఒకదాని వెంట ఒకటి బయటకు విసిరేసింది. ఏటీఎం మెషీన్ నోట్లు విరజిమ్మడంతో అతను ఆశ్చర్యపోయాడు. కాగా, ఈ ఏటీఎం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఏదో సమస్య వస్తోందని తెలుస్తోంది.

పెళ్లి పేరుతో మోసం
పెళ్లి చూపుల పేరుతో పత్రికల్లో ప్రకటన ఇచ్చి అమాయకుల నుంచి డబ్బులు దండుకున్న నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వనస్థలిపురానికి చెందిన చిలుముల మాధవ రెడ్డి చైతన్యపురిలో మ్యారేజీ బ్యూరోను నడుపుతున్నాడు.
మంచి సంబంధాలు ఉన్నాయంటూ సంబంధిత వ్యక్తుల నుంచి డిపాజిట్‌గా కొంత మొత్తం వసూలు చేసేవాడు. తార్నాకకు చెందిన ఎల్లయ్య అనే వ్యక్తి ఇతడి మాటలు నమ్మి రూ.6 వేలు చెల్లించాడు. సంబంధం మాత్రం చూపించలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications