మంత్రి మల్లారెడ్డిపై దాడి: పలువురు కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు, వదిలిపెట్టమన్న తలసాని

హైదరాబాద్: ఘట్‌కేసర్‌లో జరిగిన 'రెడ్ల సింహగర్జన సభ'లో మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌పై జరిగిన దాడి ఘటనలో పలువురు కాంగ్రెస్​ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రిపై దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు సింగిరెడ్డి హరివర్దన్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 16 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

మల్లారెడ్డి ప్రసంగంపై సభికుల ఆగ్రహం

మల్లారెడ్డి ప్రసంగంపై సభికుల ఆగ్రహం

దాడి ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా జిల్లా ఘట్‌కేసర్‌లో రెడ్ల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సింహగర్జన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి మల్లారెడ్డి హాజరు కాగా.. తీవ్రస్థాయిలో నిరసన ఎదురైంది. సభలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా సభికుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. మంత్రి ప్రసంగాన్ని పలువురు నేతలు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు.ప్రసంగంలో భాగంగా మంత్రి మల్లారెడ్డి.. టీఆర్ఎస్ సంక్షేమ పథకాల గురించి ప్రశంసిస్తూ మాట్లాడటమే ఇందుకు కారణం.

మంత్రి మల్లారెడ్డిపైకి చెప్పులు, రాళ్లు విసిరారు

మంత్రి మల్లారెడ్డిపైకి చెప్పులు, రాళ్లు విసిరారు

అంతేగాక, రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, తెలంగాణ సర్కారు​ను పొగుడుతూనే.. మంత్రి ప్రసంగం సాగింది. అయితే.. ప్రసంగంలో మంత్రి పదేపదే కేసీఆర్​, టీఆర్ఎస్ గురించి ప్రస్తావించటంతో.. తీవ్ర ఆగ్రహంతో కొందరు సభికులు కుర్చీలు పైకి లేపి మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న దళితబంధు లాగానే రెడ్లబంధు కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 5 వేల కోట్లతో రెడ్ల కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. అంతేగాక, మంత్రిపైకి చెప్పులు, రాళ్లు విసిరేసి గందరగోళం సృష్టించారు.

తిరిగి వెళ్తుండగా మంత్రి మల్లారెడ్డి వాహనంపైనా కుర్చీలు, రాళ్ల దాడి

తిరిగి వెళ్తుండగా మంత్రి మల్లారెడ్డి వాహనంపైనా కుర్చీలు, రాళ్ల దాడి

ఊహించని పరిణామంతో మంత్రి మల్లారెడ్డి తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో సభ నుంచి వెనుదిరిగారు. వెళ్లిపోయే క్రమంలోనూ మంత్రి వాహన శ్రేణి​పై కొందరు నేతలు దాడి చేశారు. కాన్వాయ్​ వెనుక పరుగులు తీస్తూ మరీ.. నీటి సీసాలు, కుర్చీలు, రాళ్లు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు మంత్రి కాన్వాయ్‌కు రక్షణగా నిలిచారు. అతికష్టం మీద మంత్రి మల్లారెడ్డిని నిరసకారుల నుంచి తప్పించిన పోలీసులు.. సభా ప్రాంగణం నుంచి సురక్షితంగా బయటకు పంపించారు.కాగా, ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

దాడికి పాల్పడినవారిని వదిలిపెట్టమన్న మంత్రి తలసాని

తనపై దాడి చేసింది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుచరులేనని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. తన హత్యకు కుట్ర పన్నారని అన్నారు. మరోవైపు తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్.. మల్లారెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. మంత్రిపై దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. మంత్రి మల్లారెడ్డిపై దాడి చేసిన వారిని విడిచిపెట్టేది లేదని మంత్రి తలసాని స్పష్టం చేశారు. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+