వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాటారం హైటెక్‌ పోలీస్ ఠాణా: అటాక్‌ప్రూఫ్‌తో అత్యాధునిక భద్రత

|
Google Oneindia TeluguNews

జయశంకర్‌ భూపాలపల్లి: రాజప్రసాదం లాంటి ఆకారం, చుట్టూ కోట బురుజుల్లాంటి కట్టడం, ఎటుచూసినా రెండు కిలో మీటర్ల వ్యాసార్థంలో ఎవరేమి చేస్తున్నా కన్పించేలా నిర్మణం... వెరసి ఆసియాలోనే గుర్తింపు కలిగిన కాటారం హైటెక్‌ పోలీస్‌స్టేషన్‌ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా సిగలో కలికితురాయిగా నిలిచే అటాక్‌ ప్రూఫ్‌ ఠాణా. సిర్వొంచ-రేణుగుంట జాతీయ రహదారి పక్కన ఉండి చూపరులకు ప్రత్యేకానుభూతి కలిగిస్తోంది.

90వ థకంలో నక్సల్స్‌కు పెట్టని కోట లాంటి దంకారణ్యంలోని తూర్పు డివిజన్‌లో వారిని దీటుగా ఎదుర్కోవడానికి పోలీస్‌శాఖ పలు చర్యలు చేసింది. ఇందులో భాగంగానే శత్రుదుర్భేద్యంగా రాజులకోట లాంటి హైటెక్‌ ఠాణా రూపుదిద్దుకుంది. 1999లో పోలీస్‌స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా సుమారు మూడేళ్ళ అనంతరం 2002లో అప్పటి డీజీపీ హెచ్‌జే దొర చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకుంది.

ఈ హైటెక్‌ ఠాణా నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం కేవలం రూ. 40 లక్షల నిధులు మాత్రమే మంజూరు చేసింది. అయితే పోలీస్‌స్టేషన్‌ నిర్మాణంలో పలు వర్గాల ప్రజలు ఇతోదిక సాయమందించటం విశేషం. కూలీ నుంచి కాంట్రాక్టర్‌ వరకు, తాపీ మేస్త్రీ నుంచి మొదలుకొని అన్ని వృత్తులవారు ఏదో ఒక రకంగా దీని నిర్మాణంలో పాలుపంచుకున్నారంటే అతిశయోక్తికాదు. అప్పటి స్థానిక పోలీస్‌ అధికారులతోపాటు ఉన్నతాధికారులు సైతం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిర్మాణం పూర్తిచేయించారు.

attack proof kataram police station

పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ప్రత్కేకంగా తెప్పించిన యుద్ధ ట్యాంక్‌ నమూనాను పెట్టించారు. స్టేషన్‌ ఎదుట ఫిరంగి నమూనాలను ఉంచారు. అలాగే రూఫ్‌టాప్ సెంట్రీ వద్ద ఉండే సెర్చ్‌ల్‌ట్ 5 కిలోమీటర్ల దూరంలో వెలుతురును ప్రసరింప చేస్తుందని సమాచారం. అంతేగాక స్టేషన్‌లో వివిధ రకాల అవసరాలకు గదులతోపాటు ఉన్నతాధికారులు ప్రత్యేక పరిస్థితుల్లో బస చేయడానికి ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ రూంను రూపొందించారు.

'ఏదేమైనా అప్పటి పరిస్థితుల పుణ్యమా అని ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన ఠాణా నిర్మాణం జరిగి చూపరులకు కనువిందు చేస్తోంది.
పనిచేయడం ఆనందంగా ఉంది' అని కాటారం సీఐ గడ్డం నదన్‌కుమార్‌ తెలిపారు.

'ప్రత్యేక గుర్తింపు కలిగిన ఠాణాలో విధులు నిర్వర్తించడం ఆనందంగా ఉంది. అప్పటి పరిస్థితుల్లో శత్రుదుర్భేద్యంగా నిర్మించిన కట్టడం రాజుల కోటలాగా ఉండి చూపరులకు కనువిందు చేస్తోంది. అప్పడున్న అధికారులు రాత్రింబవళ్లు కష్టపడి నిర్మింపజేశారు. దేశంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఈ ఠాణాకు ఉన్నందున జిల్లా వాసులకు కూడా గర్వకారణమే అవుతోంది.

English summary
story on Attack proof police station Kataram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X