కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ లో భారీ మార్పులు
Vande Bharat express: దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య మరింత పెరుగుతోంది. ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. కొత్త కొత్త మార్గాల్లో వాటిని నడిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 150 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.
కాచిగూడ- యశ్వంత్ పూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ షెడ్యూల్ లో దక్షిణ మధ్య రైల్వే అధికారులు మార్పులు చేర్పులు చేశారు. ఇవి- డిసెంబర్ 4వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ప్రయాణికుల నుంచి అందిన విజ్ఞప్తులు, సూచనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పులను నోటిఫై చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మార్పునకు అనుగుణంగా ప్రయాణికులు తమ టికెట్లను బుక్ చేసుకోవలని కోరారు.

- ప్రస్తుతం కాచిగూడ- యశ్వంత్ పూర్ 20703/20704 వందే భారత్ ఎక్స్ ప్రెస్.. బుధవారం మినహా మిగిలిన అన్ని రోజులూ ప్రయాణికులకు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.
- ఇకపై ఈ ఎక్స్ ప్రెస్ బుధవారం కూడా అందుబాటులోకి రానుంది. బుధవారానికి బదులుగా శుక్రవారం ఈ ఎక్స్ ప్రెస్ రాకపోకలు సాగించబోదు. డిసెంబర్ 4వ తేదీ నుంచి ఈ మార్పు అమలులోకి రానుంది.
- హాల్ట్ స్టేషన్లు, టైమింగ్స్ లల్లో ఎటువంటి మార్పులు లేవు.
- ప్రస్తుతం బుధవారం మినహా మిగిలిన రోజుల్లో తెల్లవారు జామున 5:45 నిమిషాలకు కాచిగూడ నుంచి బయలుదేరే నంబర్ 20703 వందే భారత్ ఎక్స్ ప్రెస్.. మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్ పూర్ కు చేరుకుంటుంది.
- యశ్వంత్ పూర్ నుంచి మధ్యాహ్నం 2:45 నిమిషాలకు బయలుదేరే నంబర్ 20704 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రాత్రి 11 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.
- మహబూబ్ నగర్, కర్నూలు సిటీ, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా రాకపోకలు సాగిస్తోంది.












Click it and Unblock the Notifications