వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ పంటపొలాల్లో టాప్ హీరోయిన్ల సందడి.. ఆ దారిన వెళ్తే ఆగకుండా ఉండలేరు మరి!!

|
Google Oneindia TeluguNews

అన్నమయ్య జిల్లా మదనపల్లి డివిజన్ లోని రైతులు అధికంగా టమాటాను సాగు చేస్తూ ఉంటారు. అయితే పంటకు దిష్టి తగలకుండా, జంతువులు, పక్షుల బారినుండి కాపాడుకోవడం కోసం వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. తంబళ్లపల్లె మండలం రెడ్డి వారి పల్లెకు చెందిన మల్ రెడ్డి తాను సాగు చేసిన టమాటా ను కాపాడుకోవడం కోసం పంట చేను చుట్టూ టాప్ హీరోయిన్లను కాపలాగా పెట్టారు.

పంట పొలం చుట్టూ టాప్ హీరోయిన్ల పోస్టర్లు

పంట పొలం చుట్టూ టాప్ హీరోయిన్ల పోస్టర్లు

పంట చక్కగా, పచ్చగా, ఏపుగా పెరగడంతో ఆ దారిన పోయే ప్రతి ఒక్కరి దృష్టి టమాటా పంట పై పడుతోంది. ఇతరుల దృష్టి తగిలి ఎక్కడ తనకు పంట చేతికి రాకుండా పోతుందన్న భయంతో వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టిన మల్ రెడ్డి పొలానికి నాలుగువైపులా హీరోయిన్లు తమన్నా, రాశి ఖన్నా, తదితర హీరోయిన్ల పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బికినీలతో హాట్ ఫోజులు ఇచ్చిన ఫోటోలను పెట్టి జనం దృష్టి వాటి మీదకు మళ్లేలా చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆ దారిన వెళ్లే ప్రతి ఒక్కరి దృష్టి ఆ ఫ్లెక్సీలపై పడుతుంది.

అన్నమయ్య జిల్లాలో రైతుల కొత్త ఐడియాకు కారణం ఇదే

అన్నమయ్య జిల్లాలో రైతుల కొత్త ఐడియాకు కారణం ఇదే

ఇక మల్ రెడ్డి బాటలోనే మరొక మహిళ కూడా తన పంట పొలానికి దిష్టి తగలకుండా హీరోయిన్ల పోస్టర్లు పెట్టింది. కురబలకోట మండలం దాదం వారి పల్లెకు చెందిన లీలమ్మ అర ఎకరం టమాటాను, అర ఎకరం బంతి పూల తోటను సాగు చేస్తున్నారు. తన పంట కూడా ఏపుగా పెరగడంతో దిష్టి తగులుతుందని భావించి హీరోయిన్ల పోస్టర్లు పెట్టారు.

సమంత, పూజా హెగ్డే, రష్మిక మందాన,తమన్నాఇలా అందరుటాప్ హీరోయిన్లు ఇప్పుడు పంట పొలాల వద్ద సందడి చేస్తున్న పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో కనిపిస్తుంది.

గతంలో నిజామాబాద్ లోనూ ఓ ఆదర్శ రైతు వినూత్న ఆలోచన

గతంలో నిజామాబాద్ లోనూ ఓ ఆదర్శ రైతు వినూత్న ఆలోచన

ఇదిలా ఉంటే గతంలో నిజామాబాద్ జిల్లాలోని ఓ తోటలో కూడా టాప్ హీరోయిన్ల ఫ్లెక్సీలు సందడి చేశాయి. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కమలాపురం గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి అనే రైతు తన పొలంలోటాప్ హీరోయిన్లఅందమైన ఫోటోలను పెద్ద పెద్దపోస్టర్లు గా వేయించిఏర్పాటు చేశారు.

9 ఎకరాల్లో ఆదర్శ వ్యవసాయం చేసిన రైతు, అందరి దృష్టి తన పంట పైనే ఉండటంతో దిష్టి తగలకుండా ఉండటం కోసం, అలాగే పక్షుల బెడద నుండి పంటను కాపాడుకోవడం కోసం ఇటువంటి ప్రయోగం చేశారు. ఏది ఏమైనా రైతుల వినూత్న ఆలోచనల పుణ్యమా అని టాప్ హీరోయిన్లు అందరూ పంట పొలాల్లో సందడి చేస్తున్నారు.

English summary
Farmers in Madanapalli division of Annamaiah district are cultivating tomato. However, posters of heroines are placed near the crop fields to protect the crops from damage by animals and birds and also from evil eyes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X