ఫెయిల్ అవుతాననే భయంతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. బిటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నిర్దేశిత ప్రమాణాలను చేరుకోలేకపోయాననే మానసిక వేదనతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలానికి చెందిన రొట్టెల స్వాతి హైదరాబాదులోని హయత్‌నగర్ బ్రిలియంట్ కళాశాలలో బిటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. మూడో ఏడాదిలో ఆమెను కళాశాల డిటెయిన్ చేసింది. దీంతో తాను ఫెయిల్ అయినట్లేనని భావించి అమ్మానాన్నలకు ముఖం చూపించుకోలేనని మనస్తాపం చెందినన స్వాతి ఆత్మహత్య చేసుకుంది.

నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలోని అమ్మమ్మ వాళ్లింటికి వచ్చి శుక్రవారం రాత్రి ఆమె ఉరేసుకుని చనిపోయింది. చనిపోయే ముందు స్వాతి రాసిన సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. "సారీ అమ్మా నేను కాలేజీ డిటెంట్ అయ్యాను, అంటే ఫెయిల్ చేస్తారు. నీ పేరు నిలబెట్టుకోలేకపోయాను. అమ్మా, మీరు బాగుండాలి. తమ్ముళ్లను చదివించి అమ్మా" అంటూ సూసైడ్ నోట్‌లో రాసింది.
కరీంనగర్ జిల్లాలోని రాయికల్ మండలం అల్లిపూర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. అల్లిపూర్‌లోని పెద్ద చెరువులో పడి ముగ్గురు బాలికలు గల్లంతయ్యారు. గల్లంతైన బాలికల కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ ముగ్గురిని తారవ్వ (8), మీనా (5), గంగవ్వ గా గుర్తించారు.












Click it and Unblock the Notifications