ఆదివారం విశాఖలో నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్!
విశాఖపట్నం వాసులకు జీవీఎంసీ ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ముఖ్యంగా నాన్ వెజ్ లవర్స్ కు షాక్ ఇచ్చే విషయం చెప్పింది. ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం నాడు నాన్ వెజ్ బంద్ అని ప్రకటించి నాన్ వెజ్ ప్రియులకు షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 15 ఆదివారం నాడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నగర పరిధిలో ఉన్న అన్ని మాంసం దుకాణాలకు సెలవు ప్రకటించింది.
ఆదివారం నాన్ వెజ్ విక్రయ కేంద్రాలు బంద్
ఇందులో భాగంగా చికెన్, మటన్, ఫిష్ ఇలా నాన్వెజ్ విక్రయ కేంద్రాలు, జంతు వధ శాలలు ఆదివారం నాడు మూసివేయబడతాయని పేర్కొంది. విశాఖ కమిషనర్ కేతన్ గార్గ్ ఈ అంశం పైన మాట్లాడుతూ ఈ నిషేధం కేవలం మహాశివరాత్రికే పరిమితం కాదని అనేక పర్వదినాలకు కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు.

అలా చేస్తే జీవీఎంసీ కఠిన చర్యలు
రేపు మహాశివరాత్రి సందర్భంగా చికెన్, మటన్, చేపలు, రొయ్యలు అమ్మకాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా దుకాణందారులు ఆదేశాలను ఉల్లంఘించి విక్రయించాలని ప్రయత్నం చేస్తే జీవీఎంసీ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. విశాఖలో ఉన్న మాంసం దుకాణదారులు 2026 సంవత్సరంలో మాంసం అమ్మకాలు నిషేధించే పర్వదినాలను గురించి తెలుసుకోవాలన్నారు.
మాంసం అమ్మకాలు నిషేధించిన జీవీఎంసీ
ఆ రోజులలో మాంసం విక్రయాలు జరపకూడదు అని పేర్కొన్నారు. ఆయా తేదీలలో దుకాణదారులు స్వచ్ఛందంగానే విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించారు. మహాశివరాత్రి పర్వదినాన మాత్రమే కాదు శ్రీరామనవమి, మహావీర్ జయంతి, మేడే, బుద్ధ జయంతి, స్వాతంత్ర్య దినోత్సవం, శ్రీ కృష్ణాష్టమి, గాంధీ జయంతి, ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం, సాదు టి ఎల్ వాస్వాని జయంతి రోజులలో మాంసం అమ్మకాలు నిషేధించింది జీవీఎంసీ.
నాన్ వెజ్ ప్రియులకు అసౌకర్యం
అయితే పండుగ రేపు ఆదివారం రావడంతో నాన్ వెజ్ ప్రియులకు కాస్తా సౌకర్యం కలుగుతున్నా, ప్రజలు సహకరించి, జీవీఎంసీ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని గ్రేటర్ విశాఖ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక జారీ చేయటంతో దుకాణందారులు నాన్ వెజ్ అమ్మే అవకాశం లేదు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications