గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అలా చేస్తే బాలాజీ నుండి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తప్పించుకొనేవాడు, కానీ, కిరణ్ హయంలో ఆయనదే హవా

సులభంగా డబ్బులు సంపాదించేందుకుగాను మోసగాళ్ళు అనేక మార్గాలను ఎంచుకొంటారు. అయితే సామాన్యుల మాదిరిగానే ఎమ్మెల్యేలు కూడ ఓ మోసగాడి వలలో చిక్కుకొన్నారు. అయితే ఈ మోసగాడిని టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఫిర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సులభంగా డబ్బులు సంపాదించేందుకుగాను మోసగాళ్ళు అనేక మార్గాలను ఎంచుకొంటారు. అయితే సామాన్యుల మాదిరిగానే ఎమ్మెల్యేలు కూడ ఓ మోసగాడి వలలో చిక్కుకొన్నారు. అయితే ఈ మోసగాడిని టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఫిర్యాదుమేరకు పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ మోసగాడి మాటలను నమ్మి బిజెపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి డబ్బులు ముట్టజెప్పాడు. కనీసం ఈ విషయమై ఆయన పార్టీ పెద్దలతో కానీ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తే నిందితుడి వ్యవహరం బట్టబయలయ్యేది.

ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారంటీ పథకం కింద కేంద్రం నుండి భారీగా నిధులొచ్చాయి. మీరంటే నాకు అభిమానం, ముందు కాస్త పెట్టుబడి పెడితే భారీగా నిధులను విడుదల చేయిస్తానని ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తూ మోసం చేస్తున్న నిందితుడు బాలాజీ అలియాస్ దేవరకుమార్ ను పోలీసులు పట్టుకొన్నారు.

Balaji cheated many people When Kirana kumar reddy as cm of Ap

ఇదే తరహలో బిజెపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి కూడ నిందితుడు ఫోన్ చేశాడు.ఈ మోసగాడికి ఇదేమీ కొత్తకాదు. దాదాపు 30 కేసులున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో బాలాజీ హావా కొనసాగింది.

లక్షా 25 వేలను డిపాజిట్ చేస్తే రెండు కోట్ల రూపాయాలు వస్తాయని నిందితుడు చెప్పగానే ఎమ్మెల్యేలు నమ్మారు. ఈ పథకం గురించి కనీసం తెలుసుకొనే ప్రయత్నం చేసుకోకపోవడం వల్ల ఇది జరిగింది. బిజెపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి నిందితుడు ఫోన్ చేయడంతో ఆయన సామాన్యుడి తరహలోనే డబ్బులను డిపాజిట్ చేశారు.

ఈ పథకం కింద ఆర్థిక శాఖ కార్యదర్శి ఎందుకు స్వయంగా ఫోన్ చేస్తారు. కేంద్రప్రభుత్వ స్కీమ్ ను అమలు చేయడానికి రాష్ట్రాల్లో ఉన్న నాయకులపై తనకు ప్రేమ ఉందని చెప్పుకోవడం వెనుక ఉన్న మర్మాన్ని గుర్తించలేకపోయారు. కనీసం బిజెపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఈ విషయాలపై ఆ పార్టీ కేంద్రనాయత్వంతో సంప్రదించినా, లేదా కేంద్రప్రభుత్వంలో ఉన్న మంత్రులతో ఈ విషయాన్ని మాట్లాడిన మోసగాడి వలలో పడకుండా తప్పించుకొనేవారు.

English summary
When Kiran kumar reddy as the chief minister of Andhra pradesh state, Balaji cheated many people.Tdp Mla Revanth Reddy complaint against him. police arrested Balaji.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X