హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

8 ఏళ్ల క్రితం పోలీసులు నన్ను ఎలా చితక్కొట్టారో చూడండి: బాల్క సుమన్ వీడియో

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం సమయంలో తనను పోలీసులు బాగా కొట్టారని చెబుతు టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ అందుకు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజు 29 నవంబర్ 2009లో తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన దీక్షను భగ్నం చేసి అరెస్టు చేసి ఖమ్మం సబ్ జైలుకు తరలించింది.

Balka Suman videos in social media

నవంబర్ 29, 30 తేదీలలో ఖమ్మం సబ్ జైలులో ఆయన ఉన్నారు. ఆ సమయంలో తార్నాకలోని ఓయూలో విద్యార్థులు భగ్గుమన్నారు. కేసీఆర్‌కు మద్దతుగా ర్యాలీ చేపట్టారు.

అక్కడకు భారీగా చేరుకున్న విద్యార్థుల ర్యాలీని పోలీసులు అడ్డగించారు. నాటి విద్యార్థి నాయకుడు బాల్క సుమన్‌పై ఆరుగురు పోలీసులు లాఠీలతో కొట్టారు. ఈ దృశ్యాలు అన్ని ఛానళ్లలో వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోను బాల్క సుమన్ పోస్ట్ చేశారు. దీనిని తాను మర్చిపోలేదని అందులో పేర్కొన్నారు.

English summary
'Can't forget this day in 2009 as police badly beaten me in OU when we rallied in support of KCR diksha for Telangana State' Balka Suman in twitter.తెలంగాణ ఉద్యమం సమయంలో తనను పోలీసులు బాగా కొట్టారని చెబుతు టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ అందుకు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X