కరీంనగర్ లో డ్రోన్స్, పారాగ్లైడర్స్, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్ ల వినియోగంపై నిషేధం.. కారణమిదే!!
కరీంనగర్ లో డ్రోన్స్, పారా గ్లైడర్స్, మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్ వినియోగంపై 15వరకు నిషేధం విధించారు కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బారాయుడు. ఈ నిర్ణయానికి గల కారణాలను వివరించారు.
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పారా గ్లైడర్స్, రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్ ల వినియోగాన్ని నిషేధిస్తున్నట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు వెల్లడించారు. డ్రోన్లు, పారా గ్లైడర్స్, మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్ ల వినియోగంపై ఈ నిషేధాజ్ఞలు ఈనెల 15వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

డ్రోన్స్ వినియోగంపై నిషేధం విధించిన కరీంనగర్ సీపీ
శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా, భద్రతా కారణాల దృష్ట్యా డ్రోన్స్ వినియోగంపై నిషేధం విధించినట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు వెల్లడించారు. ఇటీవల కాలంలో వివాహ ది శుభకార్యాలకు, వివిధ కార్యక్రమాలకు టెక్నాలజీ ని ఉపయోగించి డ్రోన్స్ సహాయంతో చిత్రీకరణ చేస్తున్నారని, అయితే దీనిని అసాంఘిక శక్తులు, ఉగ్రవాదులు కూడా వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయని, అందుకే శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సదరు సాంకేతిక పరికరాల వినియోగాన్ని నిషేధిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా డ్రోన్లను కానీ, ఇతరత్రా సాంకేతిక పరికరాలను వినియోగించాలి అనుకుంటే కచ్చితంగా పోలీసులు అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే, వారి అభ్యర్థనను పరిశీలించి సంబంధిత పోలీసు అధికారులు అనుమతులు ఇస్తారని వెల్లడించారు. ఇక ఈ మేరకు కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సి పి ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. శాంతి భద్రతలను పరిరక్షించడం కోసం ఈ నియమ నిబంధనలను అమలు చేస్తున్నామని వెల్లడించారు.

డ్రోన్స్ వినియోగించాలంటే అనుమతులు తప్పనిసరి
ఎవరైనా సరే సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించాలని భావిస్తే సంబంధిత ప్రాంతాల ఏసీపీ లతో అనుమతులు తీసుకోవాలని, అనుమతులు లేకుండా ఎటువంటి సభలు నిర్వహించకూడదని తెలిపారు. అంతేకాదు ఇతరులకు హాని తలపెట్టే విధంగా ఉండే వస్తువులు, మారణాయుధాలను ధరించి తిరగకూడదని సూచించారు. రోడ్లపైన, ప్రజలకు ఉపయోగపడే ఇతర స్థలాలలో జన సమీకరణ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు పేర్కొన్నారు.

గతంలో కూడా కరీంనగర్ లో ఇలాంటి నిషేధాజ్ఞలు
ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా శుభకార్యాలు ఉన్న సమయంలో ఇబ్బడి ముబ్బడిగా డ్రోన్లను ఉపయోగించటం వల్ల, అసాంఘిక శక్తులు కూడా దీనిని అవకాశంగా తీసుకునే వీలు ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం . ఇక ఈ విధమైన నిషేధాజ్ఞలు కరీంనగర్ లో కొత్తేమీ కాదు. గతంలో కమలాసన్ రెడ్డి, సత్యన్నారాయణ సీపీలుగా ఉన్న సమయంలో కూడా ఈ తరహా నిషేదాజ్ఞలు విధించారు.












Click it and Unblock the Notifications