వరదలు విదేశీకుట్రనటం శతాబ్దపు జోక్: బండి సంజయ్; కేసీఆర్ జేమ్స్‌బాండ్006: రేవంత్ రెడ్డి సెటైర్లు

తెలంగాణ సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ వల్లనే వరదలు సంభవించాయి అని, క్లౌడ్ బరస్ట్ వెనుక విదేశీ కుట్ర దాగి ఉందని చేసిన వ్యాఖ్యలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శతాబ్దపు జోక్ అని బండి సంజయ్ అంటే, కెసీఆర్ జేమ్స్ బాండ్ 006 అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

శతాబ్దపు జోక్ .. వైఫల్యాలు కప్పి పుచ్చుకునే కేసీఆర్ డ్రామాలు: బండి సంజయ్

శతాబ్దపు జోక్ .. వైఫల్యాలు కప్పి పుచ్చుకునే కేసీఆర్ డ్రామాలు: బండి సంజయ్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీనిని "శతాబ్దపు జోక్"గా అభివర్ణించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగా విదేశీ కుట్ర సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు.

కేసీఆర్ కు మతి భ్రమించింది.. ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించాలి: బండి సంజయ్

కేసీఆర్ కు మతి భ్రమించింది.. ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించాలి: బండి సంజయ్


భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదం అని పేర్కొన్నారు బండి సంజయ్. సీఎంకు మతి భ్రమించిందనుకుంటా అని అభిప్రాయం వ్యక్తం చేసిన ఆయన, తక్షణమే ఆయనను ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, తన అసమర్థ పాలనను కప్పిపుచ్చడానికి కెసిఆర్ ఏదో మాట్లాడుతున్నాడు అంటూ విమర్శించారు.

కేసీఆర్ 10 వేల ఇండ్లతో కాలనీ నిర్మిస్తాడా? అంత సీన్ లేదన్న బండి సంజయ్

కేసీఆర్ 10 వేల ఇండ్లతో కాలనీ నిర్మిస్తాడా? అంత సీన్ లేదన్న బండి సంజయ్

ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కెసిఆర్ అక్కడ 10000 ఇళ్లతో కాలనీ నిర్మించి ఇస్తానని ఇచ్చిన హామీపై బండి సంజయ్ మండిపడ్డారు. అర్హులైన దళితులందరికీ దళిత బంధు ఇస్తా... ఇంటింటికో ఉద్యోగం ఇస్తా... దళితుడిని సీఎంను చేస్తానన్న హామీలాలంటిదే 10 వేల ఇండ్లతో కాలనీ అంటూ బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పిల్లలకు పుస్తకాల్లేవు. ఉద్యోగులకు జీతాల్లేవు కానీ, 10 వేల ఇండ్లతో కాలనీ నిర్మిస్తాడా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.

కేంద్రాన్ని బద్నాం చేసే కుట్రలు చెయ్యటం సిగ్గు చేటు: బండి సంజయ్

కేంద్రాన్ని బద్నాం చేసే కుట్రలు చెయ్యటం సిగ్గు చేటు: బండి సంజయ్

కెసిఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి కాదంటూ బండి సంజయ్ తేల్చిచెప్పారు. అంతేకాదు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి వందలాది గ్రామాలు మంపునకు గురై వేలాది మంది నిరాశ్రయలవుతుంటే ఏమాత్రం పట్టించుకోని కేసీఆర్,ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నేతలతో మాట్లాడుతూ కేంద్రాన్ని బదనాం చేసే కుట్ర చేయడం సిగ్గుచేటు అన్నీ బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సమయాన్ని సహాయక చర్యలపై వెచ్చిస్తే ఈరోజు ఈ దుస్థితి వచ్చేది కాదు అని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.

క్లౌడ్ బరస్ట్ విదేశీ కుట్ర సమాచారం ఉంటే కేంద్రానికి ఇవ్వాలి: రేవంత్ రెడ్డి

క్లౌడ్ బరస్ట్ విదేశీ కుట్ర సమాచారం ఉంటే కేంద్రానికి ఇవ్వాలి: రేవంత్ రెడ్డి

ఇక ఇదే సమయంలో సీఎం కేసీఆర్ వరద ప్రాంతాల పర్యటన విహారయాత్రకు వెళ్లినట్లుగా ఉందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆయన వరద బాధితులను ఆదుకోవడానికి వెళ్ళినట్టుగా లేదని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. క్లౌడ్‌ బరస్ట్ వెనుక విదేశీ హస్తం ఉందన్న సమాచారం కేసీఆర్‌కు ఉంటే ఆ సమాచారాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో, రా, కేంద్ర ప్రభుత్వానికి అందజేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, ఆ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అది ముఖ్యమంత్రి బాధ్యత అని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.

కేసీఆర్ ను కేంద్రం అదుపులోకి తీసుకుని విచారించాలి: రేవంత్ రెడ్డి

కేసీఆర్ ను కేంద్రం అదుపులోకి తీసుకుని విచారించాలి: రేవంత్ రెడ్డి

కాళేశ్వరం వరద ముంపు గురించి జనం దృష్టిని మళ్ళించడం కోసం కెసిఆర్ క్లౌడ్ బరస్ట్ వెనుక విదేశీ కుట్ర ఉందంటూ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఈ కుట్ర వెనక ఎవరున్నారో తేల్చాలని లేనిపక్షంలో కేంద్రమే కేసీఆర్ ను అదుపులోకి తీసుకొని విచారించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కెసిఆర్ జేమ్స్ బాండ్ 006 అంటూ ఎద్దేవా చేసిన రేవంత్ రెడ్డి ఆయన ఒక రహస్యాన్ని ఛేదించారని, కేంద్రం దీన్ని సీరియస్ గా తీసుకోవాలంటూ పేర్కొన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతం లోనూ ఈ రకంగా క్లౌడ్ బరస్ట్ జరిపితే రెండు తెలుగు రాష్ట్రాలు ప్రమాదంలో పడతాయి అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+