పదో తరగతి మాల్ ప్రాక్టీస్ కేసు: బండి సంజయ్‌కు కోర్టులో ఊరట
వరంగల్: తెలంగాణ రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఊరట లభించింది. అతనికి మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను హనుమకొండ జిల్లా కోర్టు కొట్టివేసింది. పదో తరగతి ప్రశ్నపత్రం మాల్‌ప్రాక్టీస్ కేసులో బండి సంజయ్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో బండి సంజయ్‌కు ఏప్రిల్ 6న బెయిల్ మంజూరైంది. అయితే, సంజయ్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని, ఆయనకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు ఏప్రిల్ 17న పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఇరుపక్షాల వాదనలు విన్నారు హనుమకొండ జిల్లా నాలుగో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి మట్ట సరిత. తదుపరి వాదనల కోసం కేసును బుధవారానికి వాయిదా వేశారు.

బుధవారం ఇరువర్గాల నుంచి ఎలాంటి వాదనలు లేకపోవడంతో తీర్పు వెల్లడి గురువారానికి వాయిదా వేశారు. ఈ క్రమంలో బెయిల్ రద్దుకు సహేతుకమైన కారణాలు లేవని సంజయ్ తరపు న్యాయవాది ఎల్ రవిచందర్ వాదనలు వినిపించారు. టెస్ట్ పేపర్ కేసులో రాజకీయ కక్షతోనే బండి సంజయ్‌ను నేరస్తుడిగా చూపించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని బండి సంజయ్ తరపు న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో బండి సంజయ్‌కు సంబంధం ఉన్నట్లు నిరూపించడంలో పోలీసులు విఫలమయ్యారని పేర్కొన్నారు సీనియర్ న్యాయవాదులు ఎల్ రవించందర్, కరుణాసాగర్.
విచారణకు సహకరించాలంటూ పోలీసులు జారీ చేసిన నోటీసులో మొబైల్‌ను స్వాధీనం చేయాలని కోరడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు బండి సంజయ్ తరపు న్యాయవాదుల. అప్పటికే మొబైల్ మిస్ అయ్యిందని పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఫిర్యాదు నమోదైందని చెప్పినప్పటికీ ఈ విషయాన్ని కప్పిపుచ్చుతూ కోర్టును తప్పుదోవపట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని కోర్టుకు తెలిపారు న్యాయవాదులు.
ఆర్టికల్ 23 ప్రకారం... ఎవరైనా నేరస్తునిపై మోపబడ్డ అభియోగాన్ని నిరూపించేందుకు సాక్షాలు చూపాలే తప్ప బెదిరింపులకు పాల్పడటమంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాయడమేనన్నారు బండి సంజయ్ తరపు న్యాయవాదులు. ఇరువైపులా వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు.. పోలీసుల బెయిల్ రద్దు పిటిషన్‌ను కొట్టివేసింది.












Click it and Unblock the Notifications