డ్రగ్స్ టెస్ట్‌కు రెడీ అన్న మంత్రి కేటీఆర్‌కు ఘాటుగా బండి సంజయ్ కౌంటర్!!

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ పై ఘాటు విమర్శలు చేసారు. ఈ ఉదయం కరీంనగర్ లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని అనంతరం విలేఖరులతో మాట్లాడిన ఆయన కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. నిన్న కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్ కు రెడీ అంటూ చేసిన సవాల్ పై స్పందిస్తూ బండి సంజయ్ దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు, సవాల్ చేసిన ఇన్ని రోజులకి ఇప్పుడు మొరగడం ఎందుకు అని అన్నారు.

విదేశాలకు వెళ్లి దొరక్కుండా ఆ పని చేసి ఇప్పుడు టెస్ట్ లకు రెడీ అంటున్నావా ?

విదేశాలకు వెళ్లి దొరక్కుండా ఆ పని చేసి ఇప్పుడు టెస్ట్ లకు రెడీ అంటున్నావా ?


డ్రగ్స్ పై తాను సవాల్ చేసినపుడు స్పందించకుండా ఇప్పుడా మాట్లాడేది ఏంటి అంటూ బండి సంజయ్ విమర్శించారు. రెండు సంవత్సరాల క్రితంఎప్పుడోపిసిసి అధ్యక్షుడు సవాల్ చేస్తే ఇప్పుడు టెస్టులకు రెడీ అంటున్నాడని అసహనం వ్యక్తం చేశారు. అన్ని టెస్టులకు ప్రిపేర్ ఆయి టెస్ట్ కి రెడీ అంటున్నాడని, విదేశాలకు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపణలు గుప్పించారు.

తాను తాంబాకు తిన్నట్టు ఆధారాలు ఉన్నాయా?

తాను తాంబాకు తిన్నట్టు ఆధారాలు ఉన్నాయా?


కేటీఆర్ పేరు మీద కామెంట్ చేయొద్దని ఆర్డర్ తెచ్చాడని మండిపడ్డారు. కానీ కేటీఆర్ సంస్కారం లేకుండా ఎవరి గురించి అయినా మాట్లాడొచ్చా అంటూ ప్రశ్నించారు. తాను తాంబాకు తిన్నట్టు ఆధారాలు ఉన్నాయా? కేటీఆర్ ఎలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఇక తాను తంబాకు తిన్నట్టు చూపిస్తే తాను దేనికైనా సిద్ధం అన్నారు. ముఖ్యమంత్రి కాక ముందే ఇలా మాట్లాడితే తెలంగాణలో నువ్వు ముఖ్యమంత్రి అయితే పేదోళ్ల పరిస్థితి దారుణంగా మారుతుందన్నారు. మీ భాష చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.

హైదరాబాద్ డ్రగ్స్ కేసును ఎందుకు ఆపారో ?

హైదరాబాద్ డ్రగ్స్ కేసును ఎందుకు ఆపారో ?

హైదరాబాద్ డ్రగ్స్ కేసును దర్యాప్తు చేయకుండా ప్రభుత్వం ఎందుకు ఆపిందో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. దీని వెనుక ఎవరెవరున్నారో చెప్పాలన్నారు. దమ్ముంటే సిట్ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఏ తప్పు లేకుండా డ్రగ్స్ కేసు ఎందుకు ఆపేశారు అంటూ నిలదీసిన బండి సంజయ్ హైదరాబాద్ డ్రగ్స్ కేసు గుంజితే కొడుకు విషయం తెలుస్తదని విచారణ మూసేసారని బండి సంజయ్ ఆరోపించారు. ఇప్పుడు బూతులు తిట్టడం తప్ప ఏముంది మీరు చేసింది అంటూ అసహనం వ్యక్తం చేశారు.

మంత్రి కేటీఆర్ లిక్కర్ కేసు గురించి ఎందుకు మాట్లాడట్లేదో?

మంత్రి కేటీఆర్ లిక్కర్ కేసు గురించి ఎందుకు మాట్లాడట్లేదో?

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తప్పు చేయనప్పుడు కోర్టు ముందు నిరూపించుకోవచ్చన్నారు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఏమి అభివృద్ధి చేశాడు ప్రకటించాలని వెంటనే సవాల్ విసిరారు. మంత్రి కేటీఆర్ లిక్కర్ కేసు గురించి ఎందుకు మాట్లాడట్లేదో చెప్పాలన్నారు. ఢిల్లీలో తీగ లాగితే ఇక్కడ భయం మొదలయిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మేము సంస్కారంగా పెరిగాం అని పేర్కొన్న బండి సంజయ్ మీకు అది లేక ఇలా మాట్లాడుతున్నారు అని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+