కేసీఆర్ నశం పెడితే మేము జండూబామ్ పెడతాం; కేసీఆర్ ఒక చెల్లని రూపాయి: బండి సంజయ్

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీపై జనగామ సభలో చేసిన వ్యాఖ్యలకు, బిజెపి కార్యకర్తలకు ఇచ్చిన హెచ్చరికలకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ సీఎం కేసీఆర్ బిజెపి నేతలపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. బీజేపీ కార్యకర్తలకు నశం పెట్టి కొడతామని కేసీఆర్ హెచ్చరిస్తారా అంటూ మండిపడిన బండి సంజయ్, కెసిఆర్ నశం పెడితే మేము జండూబామ్ పెడతామని కౌంటర్ ఇచ్చారు.

కేసీఆర్ ను జైలుకు పంపిస్తాం

కేసీఆర్ ను జైలుకు పంపిస్తాం

తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని జనగామ సభ నుంచి అమలు చేస్తున్నామని కెసిఆర్ భ్రమలో ఉన్నాడని బండి సంజయ్ ఆరోపించారు. కెసిఆర్ పై కచ్చితంగా దర్యాప్తు జరుగుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నోరు తెరిస్తే మందు వాసన వచ్చే కేసీఆర్ ను పక్కాగా సభలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తామని, తాగినట్టు తేలితే జైలుకు పంపిస్తామని... ఇక అటువంటి పథకాన్ని కెసిఆర్ కోసం ఖచ్చితంగా తీసుకొస్తామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

బీజేపీపై మాట్లాడితే ఊరుకునేది లేదు

బీజేపీపై మాట్లాడితే ఊరుకునేది లేదు

సీఎం సభ పెడితే ప్రభుత్వం చేసిన పనులు చెప్పాలని, తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎంతమందికి ఇచ్చారు? నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చారు? ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అనేది మాట్లాడాలని పేర్కొన్న బండి సంజయ్ అలాకాకుండా బీజేపీపై మాట్లాడితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.

సీఎం సభకు రెండు రోజుల ముందు నుండే బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టారని, పోలీసుల సమక్షంలో బిజెపి కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

బిజెపి కార్యకర్తలంటే కెసిఆర్ ఫ్యామిలీకి గజగజ

బిజెపి కార్యకర్తలంటే కెసిఆర్ ఫ్యామిలీకి గజగజ

బిజెపి కార్యకర్తలు లాఠీలకు, దాడులకు భయపడకుండా భారత్ మాతాకీ జై అంటూ జెండాలు పట్టుకుని వస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో పాలన ఇలాగే కొనసాగితే కష్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు. నిజాం పాలన మాదిరిగా కెసిఆర్ వస్తుంటే చెప్పులు చేతుల్లో పట్టుకొని వంగి వంగి దండాలు పెట్టాలేమో అంటూ మండిపడ్డారు.

ముఖ్యమంత్రి అయి ఉండి బాధ్యత లేకుండా కేసీఆర్ మాట్లాడుతున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి కార్యకర్తలు అంటే కెసిఆర్ ఫ్యామిలీకి గజగజ అని పేర్కొన్న బండి సంజయ్ బీజేపీ నేతలతో పెట్టుకుంటే ఇబ్బంది పడతారని హెచ్చరించారు.

Recommended Video

    Indian Constitution మార్పు కోరుకోవడంలో తప్పేముందన్న MLA Kranthi Kiran | Oneindia Telugu
    కెసిఆర్ ఒక చెల్లని రూపాయి

    కెసిఆర్ ఒక చెల్లని రూపాయి

    కెసిఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీని ఏమీ చేయలేరని, అసలు కెసిఆర్ పబ్లిక్ మీటింగ్ లు ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదంటూ ఆరోపించారు. కెసిఆర్ ఒక చెల్లని రూపాయి అని విమర్శించిన బండి సంజయ్ కెసిఆర్ మాటలు ఎవరూ పట్టించుకోవడం లేదని తేల్చి చెప్పారు. రాజ్యాంగం పై చేసిన వ్యాఖ్యలపై కెసిఆర్ క్షమాపణలు చెప్తారని ఆశించామని కానీ కేసీఆర్ ఆ పని చేయలేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

    ధనిక రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని బండి సంజయ్ ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం తగ్గించినా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు తగ్గించలేదో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. పొలాల దగ్గర మీటర్లు పెడతామని కేంద్రం ఎక్కడ చెప్పిందో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+