కరీంనగర్ జైలుకు బండి సంజయ్ తరలింపు: అరెస్టుపై ఎంపీ సతీమణి ఏమన్నారంటే?
కరీంనగర్: పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అరెస్టైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు కరీంనగర్ జైలుకు తరలించారు. హనుమకండలోని న్యాయమూర్తి నివాసంలో జడ్జీ ఎదుట బండి సంజయ్‌ను హాజరుపర్చగా.. పోలీసుల రిమాండ్ రిపోర్టును పరిశీలించారు న్యాయమూర్తి. అనంతరం బండి సంజయ్‌కు ఏప్రిల్ 19 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
న్యాయమూర్తి ఆదేశాల తర్వాత బండి సంజయ్‌ను కరీంనగర్ జైలుకు తరలించారు పోలీసులు. జైలు వద్ద భారీ భద్రత, జైలుకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లించారు. జైలు వద్దకు ఇతరులు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జైలు వద్ద సంజయ్‌తో మాట్లాడేందుకు అనుమతించాలని ఆయన కుటుంబసభ్యులు కోరగా పోలీసులు నిరాకరించారు.

బండి సంజయ్ అరెస్టుపై ఆయన సతీమణి ఏమన్నారంటే?
పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ రిమాండ్ విధించడంపై ఆయన సతీమణి అపర్ణ స్పందించారు. తాము ఊహించిందే జరిగిందని.. సాయంత్రం వరకు బెయిల్ ఇవ్వలేదంటే ఇలాంటిదేదో జరుగుతుందనుకున్నామన్నారు. బండి సంజయ్ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తని.. పేపర్ లీకేజీలో ఆయన ప్రమేయం ఉండబోదని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని అన్ని అంశాల్లోనూ ప్రశ్నిస్తున్నారు కాబట్టే ఆయనను అర్ధరాత్రి బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఇబ్బంది పెట్టారని విమర్శించారు. ఒక ఎంపీనే ఇలా వేధిస్తున్నారంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు అపర్ణ.
ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్‌పై ఏ1, ప్రశాంత్(మాజీ జర్నలిస్టు) ఏ2, గుండోయిన మహేశ్ ఏ3(కేఎంసీ ల్యాబ్ అసిస్టెంట్), మైనర్ బాలుడు ఏ4, శివగణేశ్ ఏ5, పోగు సుభాష్ ఏ6, పోగు శశాంక్ ఏ7, దూలం శ్రీకాంత్ ఏ8, పెరుమాండ్ల శ్రామిక్ ఏ9, పాతబోయిన వర్షిత్ ఏ10 నిందితుడిగా పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications