హన్మకొండ కోర్టులో బండి సంజయ్.. చెప్పులు, కోడిగుడ్లతో బీఆర్ఎస్ శ్రేణుల ఎటాక్, పోలీసుల లాఠీచార్జ్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను ఈరోజు ఉదయం బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ నుంచి తరలించిన పోలీసులు, అనేక ఉద్రిక్త పరిస్థితుల మధ్య బండి సంజయ్ ను ఎట్టకేలకు హనుమకొండలోని అదాలత్ జంక్షన్లోని కోర్టుకు తీసుకొచ్చారు. బండి సంజయ్ ను హనుమకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.

బండి సంజయ్ ను కోర్టుకు తీసుకురావడంతో కోర్టు ముందు బిజెపి, బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకోవడంతో హన్మకొండ కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బండి సంజయ్ ను వరంగల్ పి టి సి కి తరలించి అక్కడినుండి కోర్టు వెనుక గేటు నుండి లోపలికి తీసుకువెళ్లి కోర్టులో ప్రవేశపెట్టారు.హనుమకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ అనిత రాపోలు ఎదుట బండి సంజయ్ ను హాజరు పరిచారు.

 Bandi Sanjay in Hanmakonda court.. BRS ranks attacked with sandals and eggs, police lathi charge

ఇదిలా ఉంటే కోర్టుకు తీసుకు వెళుతున్న సమయంలో కోర్టుకు వెళ్ళే దారిలో బీఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ పై దాడికి యత్నం చేశారు. కొందరు బిఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ వాహనంపై చెప్పులు విసిరే ప్రయత్నం చేశారు. కోడిగుడ్లు విసిరారు. ఇటు కోర్టు ప్రాంగణంలోనూ పోలీస్ వాహనాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు . దీంతో బి ఆర్ ఎస్ శ్రేణిలపై పోలీసులు లాఠీచార్జి చేసే చెదరగొట్టారు. కోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇదిలా ఉంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బిజెపి నేతలను ముందస్తుగా హౌస్ అరెస్టులు చేశారు.

 Bandi Sanjay in Hanmakonda court.. BRS ranks attacked with sandals and eggs, police lathi charge

పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అనేక కీలక విషయాలను పేర్కొన్నారు. బండి సంజయ్ పై 420, 120B, సిఆర్ పి సి 154, 157 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల జాబితాలో బండి సంజయ్ పేరును చేర్చి పకడ్బందీగా నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. పేపర్ లీకేజీల వెనక బండి సంజయ్ కుట్ర ఉందని, ఎగ్జామినేషన్ సెంటర్ల వద్ద ధర్నా చేయాలని బండి సంజయ్ కుట్ర పన్నారని పోలీసులు బండి సంజయ్, ప్రశాంత్ కు మధ్య జరిగిన వాట్సప్ చాటింగ్ ఆధారంగా గుర్తించినట్టు తెలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+