మోదీ కానుకగా 20వేల ఫ్రీ సైకిళ్ళు.. కేంద్రమంత్రి బండి సంజయ్ మరో రికార్డు!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరో రికార్డును సృష్టించనున్నారు. కరీంనగర్ వేదికగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆయన తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థిని, విద్యార్థులు అందరికీ ఉచిత సైకిళ్ళను పంపిణీ చేయనున్నారు. మొత్తం 20వేల సైకిళ్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న బండి సంజయ్ దీనికోసం సి ఎస్ ఆర్ ఫండ్స్ ను చెల్లించి సైకిల్స్ కొన్నారు.

విద్యార్థినీ విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ
బ్రాండెడ్ సైకిల్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చి 20 వేల సైకిళ్ళను కొనుగోలు చేశారు. రేపు ఈ సైకిల్స్ పంపిణిని కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు బండి సంజయ్ తన చేతుల మీదుగా సైకిల్స్ ను విద్యార్థినీ విద్యార్థులకు అందజేయనున్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు.

Bandi Sanjay is ready for another record 20 000 free bicycles as a gift from Modi

Take a Poll

కరీంనగర్ లో సైకిళ్ళ పంపిణీ
ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తోపాటు జిల్లా అధికార యంత్రంగా హాజరుకానున్నారు. బండి సంజయ్ ఈ సైకిళ్ల పంపిణి బాధ్యతలు జిల్లా కలెక్టర్ కు అప్పగించారు. కరీంనగర్ లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా ఈ సైకిల్స్ ను పంపిణీ చేయనున్నారు.

నెలరోజుల్లో సైకిల్స్ పంపిణీ పూర్తి చెయ్యాలన్న బండి సంజయ్
నెల రోజుల్లో ఈ సైకిల్స్ పంపిణీ పూర్తిచేయాలని, పాఠశాలలో చదువుకునే ప్రతి విద్యార్థికి సైకిల్ అందజేయాలని బండి సంజయ్ కోరారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కానుకగా సైకిల్స్ ను బండి సంజయ్ విద్యార్థులకు అందించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే నిరుపేద విద్యార్థులు రవాణా సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న విషయం బండి సంజయ్ దృష్టికి రాగా, బండి సంజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

పుట్టినరోజున మోదీ కానుకగాప్రభుత్వ స్కూల్స్ పిల్లలలకు సైకిల్స్
సహజంగా రాజకీయ నాయకులు ఎవరైనా సరే తమ పుట్టినరోజులు వస్తున్నాయంటే కేకులు కట్ చేసి, ఊరువాడ సంబరాలు చేస్తారు. కానీ అందుకు భిన్నంగా బండి సంజయ్ గత కొన్ని సంవత్సరాలుగా తన పుట్టినరోజును పేద వర్గాలకు సేవ చేయడానికి కేటాయిస్తున్నారు. పేదలకు విద్య , వైద్యం అందని ద్రాక్షలా మారకుండా ఉండడం కోసం తనవంతుగా బండి సంజయ్ వారికి చేయూతనిస్తూ వైవిధ్యభరితమైన సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రస్తుతం కరీంనగర్ లో విద్యార్థిని విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ కార్యక్రమం ద్వారా బండి సంజయ్ తన ఉదారతను మరోమారు చాటుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+