Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వారి సమస్యల పరిష్కారానికి అఖిలపక్ష భేటీ నిర్వహించాలి; సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

తెలంగాణ సీఎం కేసీఆర్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికే రాష్ట్రంలో రైతుల సమస్యలపై విరుచుకుపడిన బండి సంజయ్ తాజాగా కౌలు రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, కౌలు రైతుల సమస్యలు పరిష్కరించే నాథుడే లేకుండా పోయాడు అని కేసీఆర్ కు రాసిన లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు. కౌలు రైతుల పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం చూపుతున్న వివక్ష క్షమించరానిదని ఆయన మండిపడ్డారు.

కౌలు రైతుల సమస్యలపై కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

కౌలు రైతుల సమస్యలపై కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

కాయకష్టం చేసే కౌలు రైతులకు రైతు బంధు, రైతు బీమా, యంత్రలక్ష్మి సహా ప్రభుత్వ పథకాలు ఏవీ వర్తించక పోవడం అన్యాయమని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. కౌలు రైతులకు ఎలాంటి భరోసా లేదన్నారు. కౌలు రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు పొందే సౌకర్యం కూడా లేకపోవడం దారుణమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో 14 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాలు కౌలు రైతులకు అమలుకాకపోవటం దారుణం

సంక్షేమ పథకాలు కౌలు రైతులకు అమలుకాకపోవటం దారుణం

వారికి రైతులకు అందించే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని పేర్కొన్నారు. ఒక్క సంక్షేమ పథకాలు కూడా కౌలు రైతుల కోసం అమలు కాకపోవడం బాధాకరమని బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. భూ యజమానుల హక్కులకు భంగం వాటిల్లకుండా కౌలు రైతులకు భరోసా కల్పించేలా కౌలు చట్టంలో మార్పులు తీసుకురావాలని 11వ పంచవర్ష ప్రణాళికలో పేర్కొన్నప్పటికీ ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని బండి సంజయ్ విమర్శించారు.

భూమిని సాగు చేసేవారే నిజమైన రైతులు .. అది కౌలు రైతులైనా సరే

భూమిని సాగు చేసేవారే నిజమైన రైతులు .. అది కౌలు రైతులైనా సరే

కౌలు రైతుల సంక్షేమం కోసం నాబార్డు పావలా వడ్డీకే రుణాలు ఇవ్వాలని సూచించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. భూమిని సాగు చేసి పంటలు పండించే వారే నిజమైన రైతులని పేర్కొన్న బండి సంజయ్, అటువంటి రైతుల కోసం ఎరువులు విత్తనాలతో పాటు, వ్యవసాయ సబ్సిడీలు అన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో రైతు సంక్షేమాన్ని విస్మరిస్తుందని బండి సంజయ్ ఆరోపించారు.

కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి అఖిల పక్ష సమావేశం .. బండి సంజయ్ డిమాండ్

కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి అఖిల పక్ష సమావేశం .. బండి సంజయ్ డిమాండ్

తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలపై చర్చించడానికి రైతు సంఘాలు మేధావులు అన్ని రాజకీయ పార్టీలతో అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని బండి సంజయ్ లేఖలో డిమాండ్ చేశారు. కౌలు రైతులను ప్రభుత్వం రైతులుగా చూడటం లేదన్నారు. రాష్ట్రంలో కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని బండి సంజయ్ పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+