కేసీఆర్.. నీ మాటలు ఉత్తరకుమార ప్రగల్భాలేనా? బండి సంజయ్ బహిరంగ లేఖ

రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిత్యం తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ రాష్ట్రంలోని అనేక సమస్యలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా మరోమారు సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన బండి సంజయ్ కెసిఆర్ కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కోరుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.

 కేసీఆర్ చేసిన ప్రకటన ఉత్తర కుమారుడి ప్రగల్భాలే

కేసీఆర్ చేసిన ప్రకటన ఉత్తర కుమారుడి ప్రగల్భాలే

తెలంగాణ బిజెపి చేసిన అనేక ఉద్యమాల నేపథ్యంలో ఒడ్లు కొనడానికి మీరు ముందుకు వచ్చారని, అందులో భాగంగానే రాష్ట్రంలో ప్రతి వడ్లగింజ కొంటామని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత ఆర్భాటంగా ప్రకటించారని బండి సంజయ్ పేర్కొన్నారు. కెసిఆర్ ప్రకటన చేసి 15 రోజులు కావస్తున్నా ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు జరగడం లేదంటూ ఆయన ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనిస్తే కేసీఆర్ చేసిన ప్రకటన ఉత్తర కుమారుడి ప్రగల్భాలే అని అర్థమవుతోందని బండి సంజయ్ పేర్కొన్నారు.

కళ్లకు కట్టుకున్న గంతలు తీసి రైతుల సమస్యలు చూడండి

కళ్లకు కట్టుకున్న గంతలు తీసి రైతుల సమస్యలు చూడండి


క్షేత్ర స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మీరు ఇప్పటికైనా కళ్లకు కట్టుకున్న గంతలు తీసి చూడాలని విజ్ఞప్తి చేస్తున్నామని బండి సంజయ్ వెల్లడించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న తనకు అనేక మంది రైతులు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు అని పేర్కొన్న బండి సంజయ్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని లేఖలో కళ్లకు కట్టినట్టు చెప్పారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ లో 71 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉండగా, కేవలం రెండు కొనుగోలు కేంద్రాలు మాత్రమే ప్రారంభించారని పేర్కొన్నారు.

 రాష్ట్ర ప్రభుత్వానికి రైతు సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదు

రాష్ట్ర ప్రభుత్వానికి రైతు సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదు


ఇక వనపర్తి లో 225 కేంద్రాలకు 19 కేంద్రాలు, నారాయణపేటలో 91 కేంద్రాలకు 70 కేంద్రాలు మాత్రమే ప్రారంభించారని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని చెబుతున్న ప్రభుత్వం నామమాత్రంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను మోసం చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 60 లక్షల టన్నుల ధాన్యం కొనాల్సి ఉండగా, రెండు లక్షల టన్నులు మాత్రమే ఇప్పటి వరకు కొనుగోలు చేసిందని, దీనిని బట్టే రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్ల ఎంత శ్రద్ధ, చిత్తశుద్ధి ఉందో స్పష్టమవుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు.

ప్రతి గింజ కొనే వరకు రైతుల పక్షాన బీజేపీ పోరాటం

ప్రతి గింజ కొనే వరకు రైతుల పక్షాన బీజేపీ పోరాటం


తెలంగాణ రైతాంగం సాగు చేసిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలుకయ్యే ప్రతి ఒక్క పైసా కేంద్రం నుండి వస్తున్న కారణంగా, అలసత్వం వహించకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బండి సంజయ్ కేసీఆర్ ను డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు సాగు చేసిన ప్రతి గింజనూ కొనుగోలు చేసే వరకు, వారికి చెల్లించాల్సిన డబ్బులను చెల్లించే వరకు రైతుల పక్షాన బిజెపి పోరాటం సాగిస్తుందని పేర్కొన్నారు బండి సంజయ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+