బండి సంజయ్ చెప్పినా బీజేపీ టీడీపీ పొత్తుపై పితలాటకం.. ఎందుకంటే!!

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోబోదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తేల్చి చెప్పారు. ఇక ఇదే విషయాన్ని క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల వద్దకు తీసుకు వెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. అయితే దీంతో బిజెపి నాయకులలో ఊపిరిపీల్చుకున్న వర్గం కొందరైతే, మరి కొందరికి ఇంకా పొత్తు పైన అనుమానాలు అలాగే ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబును తక్కువగా అంచనా వేయలేమని, అలాగే కేంద్రంలోని బీజేపీ అగ్రనేతల ఆలోచనలను కూడా ఊహించడం కష్టమే అని అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతుంది.

చంద్రబాబు తెలంగాణా రాజకీయాలపై ఆసక్తికర చర్చ

చంద్రబాబు తెలంగాణా రాజకీయాలపై ఆసక్తికర చర్చ


రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది గతంలో ఎన్నో రాజకీయ పరిణామాల ద్వారా మనం చూశాం. సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు పార్టీని బలోపేతం చేయడానికి రీ ఎంట్రీ ఇవ్వడం కచ్చితంగా ఆయన వ్యూహాత్మక ఎత్తుగడ అన్నది అందరూ ఒప్పుకునే అంశం అయితే చంద్రబాబు ఖమ్మంలో సభ పెట్టి తెలంగాణ రాజకీయాలలోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆయన బీజేపీతో పొత్తు కోసం తెలంగాణలో మళ్లీ వచ్చారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

బండి సంజయ్ పొత్తు ఉండదని చెప్పిన కారణాలు ఇవే

బండి సంజయ్ పొత్తు ఉండదని చెప్పిన కారణాలు ఇవే

అయితే టీడీపీతో పొత్తు పెట్టుకోవలసిన అవసరం బీజేపీకి లేదని తెలంగాణ బీజేపీ అగ్రనేతలు ఇటీవల జరిగిన సమావేశంలో ఆసక్తికర చర్చ జరిపి పొత్తుపై తేల్చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుందని కమల దండు తేల్చిచెప్పారు. రాష్ట్రంలో 119 సీట్లకు నాలుగంచెల పార్టీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని రంగం లోకి దిగుతున్న వేళ తెలుగుదేశం పార్టీతో పొత్తు తమకు అవసరం లేదని, అటువంటి పరిస్థితే ఉత్పన్నం కాదని బిజెపి నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ కూడా తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు ఉండబోదని తేల్చి చెప్పారు.

పొత్తుకు ఛాన్స్... కారణాలు ఇవేనా?

పొత్తుకు ఛాన్స్... కారణాలు ఇవేనా?

కానీ ఈ ప్రకటన పైన పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బండి సంజయ్ టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దని బలంగా భావించినప్పటికీ, ఒకవేళ ఎన్నికలు దగ్గర పడే సమయానికి అధిష్టానం పొత్తు నిర్ణయం తీసుకుంటే బండి సంజయ్ కచ్చితంగా ఫాలో చేయాల్సిందేనని భావిస్తున్నారు. అయితే దీనికి కూడా అనేక కారణాలను విశ్లేషిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎంత బలోపేతం అయినప్పటికీ, ఇంకా క్షేత్రస్థాయిలో పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీకి చెప్పుకోదగిన నేతలు లేకపోయినా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం గానే ఉంది. ఇక ఈ పరిస్థితులలో బిజెపి ఒంటరిగా పోటీ చేసి కేసీఆర్ పార్టీని ఓడించగలుగుతుందా అన్నది కూడా ఒక ప్రశ్న గానే ఉంది.

బండి చెప్పిందే తుది నిర్ణయం కాకపోవచ్చు.. చర్చ

బండి చెప్పిందే తుది నిర్ణయం కాకపోవచ్చు.. చర్చ


దీంతో బండి సంజయ్ చెప్పిందే తుది నిర్ణయం కాకపోవచ్చని, బిజెపి అగ్రనాయకత్వం పొత్తుల విషయంలో ఆలోచన మార్చుకుంటే పొత్తు పెట్టుకునే ముందుకు వెళ్లాల్సి వస్తుందని భావిస్తున్న వారు లేకపోలేదు. తెలంగాణ బీజేపీ నేతలు టీడీపీతో పొత్తు లేదని తేల్చి చెప్పినప్పటికీ చంద్రబాబు సైలెంట్ గా ఉన్నారు. ఆయన పొత్తు కోసం చెయ్యాల్సిన పని చాపకింద నీరులాగా చేసుకొని పోతారు అని భావిస్తున్న వారు ఉన్నారు. మొత్తానికి బండి సంజయ్ చెప్పిందే ఫైనల్ డెసిషన్ కాదని, ఒకవేళ అధిష్టానం పొత్తులతో వెళ్ళాలని చెబితే కచ్చితంగా తెలంగాణ బిజెపి ఆ మార్గంలో వెళ్లక తప్పదని చర్చిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+