రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా కూలుతుందంటే... బండి సంజయ్ వీడియో!!

బిజెపి ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పైన, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల సమరంపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన బండి సంజయ్ దేశాన్ని హస్తగతం చేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, INDI కూటమి నుండి ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును ఎందుకు చెప్పలేకపోతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీని ఎందుకు పీఎం అభ్యర్థిగా చెప్పటం లేదు
దేశాన్ని పాలించే సమర్థత కాంగ్రెస్ పార్టీకి లేదని, కనీసం కాంగ్రెస్ పార్టీ పీఎం అభ్యర్థిని కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీపై కాంగ్రెస్ కు ప్రేమ ఉంటే, సమర్ధుడు అని నమ్మితే ఎందుకు ప్రధాని అభ్యర్థి అని చెప్పటం లేదన్నారు. దేశవ్యాప్తంగా ఇతర పార్టీలలో దేశాన్ని కాపాడే నాయకుడు ఒక్కరు కూడా లేరని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Bandi Sanjay sensational comments video Revanth Reddy govt will collapse

రేవంత్ రెడ్డి సర్కార్ పైన సంచలన వ్యాఖ్యలు
ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారన్నారు. మోదీ చరిష్మా మళ్ళీ వర్కవుట్ అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పైన, రేవంత్ రెడ్డి సర్కార్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలచే ఎన్నుకోబడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లపాటు పాలన సాగించాలని బండి సంజయ్ కోరారు. ప్రజల తీర్పును అందరం గౌరవించాలన్నారు.

ఆరు హామీల పేరుతో కాంగ్రెస్ మోసం
ఐదేళ్లపాటు కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంటుందో ప్రజలకు అర్థం కావాలంటే వారి పరిపాలన కొనసాగాల్సిందే అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆరు హామీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని, కాంగ్రెస్ మోసాలు తక్కువ కాలంలోనే ప్రజలకు అర్థమయ్యాయని బండి సంజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే అబద్దాల పుట్ట అని అందరికీ అర్ధం అయిందన్నారు.

కాంగ్రెస్ ఇంకొకరికి కూల్చే అవకాశం ఇవ్వదు
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోయిందని, ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీపై, ఇతర పార్టీల నాయకులపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన వాడుతున్న భాష కారణంగా ఆయనపై ప్రజలలో గౌరవం పోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం ఎవరికీ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆ పార్టీ నేతలే భస్మాసుర హస్తం పెడతారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఇంకొకరికి కూల్చే అవకాశం ఇవ్వదని, ఆ పని వాళ్లే చేసుకుంటారని ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+