హిందువులు తుమ్మితే బీఆర్ఎస్ గాల్లో కొట్టుకుపోతుంది: కేసీఆర్‌పై వాల్కెనోలా విరుచుకుపడ్డ బండి సంజయ్!!
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముస్లింలంతా ఒక్కటై బండి సంజయ్ ను ఓడించాలంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో స్పందించారు. 20శాతం ఓట్ల కోసం 80శాతం హిందువులను అవమానిస్తున్న కేసీఆర్ ను ఓడించి హిందువుల సత్తాను చాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. ఈరోజు సిరిసిల్లలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.
కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్
''హిందూ సమాజమంతా తన వెనుకుంది. నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా... కరీంనగర్ లో వినోద్ కుమార్ ఓడిపోతే బీఆర్ఎస్ ను మూసేసి రాజకీయాల నుండి తప్పుకునేందుకు నువ్వు సిద్ధమా?''అంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలన్నారు. తెలంగాణకు కేంద్రం పైసా ఇవ్వలేదా? 'తెలంగాణకు రూ.10లక్షల కోట్లదాకా నిధులిచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిది. ఈ అంశంపై చర్చకొస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిరూపిస్తా''అన్నారు.

కేసీఆర్ ఎమోషనల్ బ్లాక్ మెయిలర్
కేసీఆర్ లాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలర్ ఈ ప్రపంచంలోనే మరొకరు లేరన్నారు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో తెలంగాణ ఉద్యమంలో 1400మందిని బలి తీసుకున్న రాక్షసుడు కేసీఆర్ అంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ అరాచకాలతోపాటు 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రశ్నిస్తుంటే.. ఆ రెండు పార్టీలు కలిసి తనను ఓడించేందుకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటుకు రూ.5వేల చొప్పున, రూ.2వేల చొప్పున మరొకరు ఓటర్లకు పంచుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామా
కాంగ్రెస్, బిఆర్ ఎస్ పొలిటికల్ డ్రామా తో ప్రజల దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సిరిసిల్ల కార్మికుల దినస్థితికి కారణం పదేళ్ల కేసిఆర్ పాలన అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతలు పత్తా లేకుండా పోతారు. కేసిఆర్ కుటుంబం మాదిరి ఇక్కడి కాంగ్రెస్ నేతలు దోచుకొని ఉడాయించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అని గూగుల్ లో సెర్చ్ చేస్తే వచ్చే పేరు కేసిఆర్ అన్నారు.
కేంద్రం తరపున లేఖ రాస్తే స్పందించని మూర్ఖుడు కేసిఆర్
పుల్వామ సర్జికల్ స్ట్రైక్ పై దమ్ముంటే దేశ సరిహద్దులోకి వెళ్లి కరీంనగర్ లో చేసిన వ్యాఖ్యలు చెయ్యాలన్నారు. కాళేశ్వరం డిపిఆర్ గురించి విజ్ఞప్తి చేస్తే ఇవ్వకుండా జాతీయ హోదా రాకుండా కేంద్రంను బద్నాం చేసిన వ్యక్తి కేసిఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు నవ్వుల పాలు అయ్యేలా చేసిన వ్యక్తి కేసిఆర్. ప్రసాద్ స్కీమ్ కింద వేములవాడ, కొండగట్టు అభివృధి చేస్తామని కేంద్రం తరఫున లేఖ రాస్తే స్పందించని మూర్ఖుడు కేసిఆర్ అన్నారు.
హిందువులు తుమ్మితే మీ పార్టీ గాల్లో కొట్టుకుపోతుంది
కేసీఆర్ లాంటి గలీజు లీడర్ ఇంకొకరు లేరన్నారు. కేటీఆర్ నోట జై శ్రీరాం మాటే రాదన్నారు. రాముడిని కూడా అవమానిస్తున్నారన్నారు. హిందువుల గురించి హేళన చేస్తున్న కేసిఆర్ కు బుద్ది చెప్పాలని, హిందూ సమాజం సంఘటితం కావాల్సిన అవశ్యకత ఉందన్నారు. కేసిఆర్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తే బీజేపీని గెలిపించండి. హిందువులు తుమ్మితే మీ పార్టీ గాల్లో కొట్టుకొని పోతోందన్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications