వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి బయటపడ్డ కేసీఆర్ ప్రభుత్వ అసమర్థత-పార్లమెంట్ సాక్షిగా స్వయంగా కేంద్రమంత్రే చెప్పారు:బండి సంజయ్

|
Google Oneindia TeluguNews

తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్న ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ చేస్తున్న ఆరోపణలన్నీ అబద్దాలనే విషయం మరోసారి రుజువైందన్నారు. పార్లమెంట్ సాక్షిగా కేసీఆర్ ప్రభుత్వ అసమర్థత,నిర్లక్ష్య వైఖరి బయటపడిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి నిధులు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ... తెలంగాణ ప్రభుత్వం ఆ నిధులను ఉపయోగించుకోవట్లేదని విమర్వించారు.

స్వయంగా కేంద్రమంత్రే చెప్పారు... : బండి సంజయ్

స్వయంగా కేంద్రమంత్రే చెప్పారు... : బండి సంజయ్

ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై),ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకాల కింద తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని బండి సంజయ్ అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి వాటిని వినియోగించుకునే ఆలోచన లేదని... ఇది సిగ్గుచేటని మండిపడ్డారు. పీఎంజీఎస్‌వై కింద తగిన నిధులు వాడుకోవడానికి తెలంగాణకు అర్హత ఉందని స్వయంగా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్ పార్లమెంటులో చెప్పారన్నారు.

వాడుకోవడం చేతకాని ప్రభుత్వం : బండి సంజయ్

వాడుకోవడం చేతకాని ప్రభుత్వం : బండి సంజయ్

దేశంలో అర్హులైన పేదలకు ఇళ్లు,మారమూల ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం ఉండాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ పథకాలను తీసుకొచ్చిందన్నారు. 2016లో ప్రవేశపెట్టిన పీఏంఏవై పథకం కింద రాష్ట్రానికి కేంద్రం 70,674 ఇళ్లు మంజూరు చేసినప్పటికీ.. ఒక్క ఇంటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించలేదన్నారు. తెలంగాణ అభివృద్ది,ప్రజల సంక్షేమ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కేసీఆర్ ప్రభుత్వానికి వాడుకోవడం చేతకావట్లేదన్నారు.

చిత్తశుద్ది లేని ప్రభుత్వం : బండి సంజయ్

చిత్తశుద్ది లేని ప్రభుత్వం : బండి సంజయ్

సోమవారం(జులై 19) బీబీనగర్ ఎయిమ్స్‌ను సందర్శించిన సమయంలోనూ బండి సంజయ్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా మోదీ సర్కార్ వేల కోట్ల రూపాయలు వైద్యం కోసం ఖర్చు చేస్తోందన్నారు. బీబీనగర్ ఎయిమ్స్‌కు ఏటా నిధులు పెంచుతోందన్నారు. కేంద్రం నుంచి నిధులు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌ను పట్టించుకోవట్లేదన్నారు. హైదరాబాద్‌కు నాలుగు దిక్కుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తామని చెప్పిన కేసీఆర్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని విమర్శించారు.

English summary
BJP state president Bandi Sanjay said that the allegations, Center was not giving funds to Telangana were not true. Despite the possibility of taking funds from the central government schemes ... The Telangana government was criticized for not using those funds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X