కేసీఆర్ చాలా బిజీ..: సకల జనుల సమ్మె మరోసారి అంటూ బండి సంజయ్ ఫైర్

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు.
తెలంగాణలో ఉద్యోగుల బదిలీపై గందరగోళం ఏర్పడిందన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి బండి సంజయ్‌ తెలంగాణ గవర్నర్‌ తమిళసైని కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, టీచర్ల సమస్యలు, 317 జీవో పునఃసమీక్షపై గవర్నర్‌తో బండి సంజయ్‌ బృందం చర్చించింది.

సీఎం కేసీఆర్ చాలా బిజీ అంటూ బండి సంజయ్

సీఎం కేసీఆర్ చాలా బిజీ అంటూ బండి సంజయ్

అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బిజీగా ఉన్నారు.. ఉద్యోగుల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరు.. అందుకే గవర్నర్ ని కలిశామన్నారు. హడావుడిగా విడుదల చేసిన జీవోను సవరించాలని గవర్నర్ ను కోరామన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినప్పుడే ఉద్యోగ కేటాయింపు లు చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని, 41 నెలలు ఏమి చేయకుండా ఇప్పుడు అగమాగం కేటాయింపులు చేస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్.. ఉద్యోగుల పాపం ఊరికే పోదు: బండి సంజయ్

కేసీఆర్.. ఉద్యోగుల పాపం ఊరికే పోదు: బండి సంజయ్

సీనియర్లకు జూనియర్లకు పంచాయతీ పెట్టిస్తున్నారని, స్థానికత కోసమే తెలంగాణ ఉద్యమం నడిచిందని.. ఇప్పుడు ఆ స్థానికతను తుంగలో తొక్కారని బండి సంజయ్ విమర్శించారు. ఒక జిల్లా ఉద్యోగి మరో జిల్లాకు కేటాయిస్తున్నారని, ఉద్యోగుల పాపం ఊరికే పోదు కేసీఆర్.. అంటూ సంజయ్‌ ధ్వజమెత్తారు. 317 జీఓని సవరించాలన్నారు. ఈ జీఓలో తమకు అనుకూలమైన వారిని ఇష్టమొచ్చిన చోట కేటాయించుకునే ఆప్షన్ ఉందన్నారు. జీవోను సవరించే వరకు బదిలీల ప్రక్రియను ఆపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

సకల జనుల సమ్మె మరోసారి అంటూ బండి సంజయ్

సకల జనుల సమ్మె మరోసారి అంటూ బండి సంజయ్

సీఎం వెంటనే ఉద్యోగుల సమస్యలపై స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఇంకా ఎంత మంది ఉసురు పోసుకుంటే సీఎంకి కనికరం కలుగుతుందని సంజయ్ విమర్శించారు. స్పౌజ్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాల్లు, దివ్యాంగులైన ఉద్యోగుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. అంతేగాకుండా ఉద్యోగులు ఆవేదన చెందకండి... అనారోగ్యంకి గురికాకండి. సకల జనుల సమ్మె మరో సారి చేయాల్సి వస్తుంది. ఉద్యోగ ఉపాధ్యాయులకు అండగా బీజేపీ ఉంటుంది. టీజీఓ, టీఎన్జీవో లు ఇప్పటికైనా మనసు మార్చుకోవాలన్నారు బండి సంజయ్‌. ఈ విషయంలో ఆందోళనపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+