వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది ఇందుకే: భగ్గుమన్న బండి సంజయ్

నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమని బండి సంజయ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆ నిర్ణయం వల్లే ఈ పరిస్థితి నెలకొందని బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో ఈరోజు అగ్నిప్రమాద ఘటన అందర్నీ ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. తెలంగాణా నూతన సచివాలయ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయంలో అగ్నిప్రమాద ఘటన చోటు చేసుకోవడంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.

నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం అందుకే: బండి సంజయ్

నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం అందుకే: బండి సంజయ్

నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమని బండి సంజయ్ పేర్కొన్నారు. ఆదరాబాదరాగా క్వాలిటీ లేకుండా పనులు చేస్తుండటం వల్లే ఈ పరిస్థితి నెలకొందని బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తన పుట్టినరోజు నాడే సచివాలయాన్ని ప్రారంభించాలన్న తొందరపాటులో తీసుకుంటున్న చర్యల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు అయిన ఫిబ్రవరి 17వ తేదీనే నూతన సచివాలయాన్ని ప్రారంభించాలనే ఆలోచనను వాయిదా వేసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

నూతన సచివాలయాన్ని అప్పుడే ప్రారంభించాలి

నూతన సచివాలయాన్ని అప్పుడే ప్రారంభించాలి

భారత రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు నాడు నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. నూతన సచివాలయ నిర్మాణంలో ఫైర్ సేఫ్టీ తో పాటు, అన్ని రకాల పనులను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ కోరారు.

నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం.. కొత్త భవనంలో ఇలా జరిగిందేంటి?

నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం.. కొత్త భవనంలో ఇలా జరిగిందేంటి?

త్వరలో ప్రారంభోత్సవాన్ని జరుపుకోనున్న తెలంగాణ సచివాలయంలో నేడు తెల్లవారు జామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సచివాలయంలోని మొదటి అంతస్తులో ప్రమాదం సంభవించడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో ప్రమాద సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి 11 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇక అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో సెక్రటేరియట్ చుట్టుపక్కల ఉన్న రోడ్లన్నింటినీ, ఎవరిని ఆ మార్గం వైపు అనుమతి ఇవ్వడం లేదు. అయితే కొత్త సెక్రటేరియట్ లో అగ్నిప్రమాదం నేపధ్యంలో అందరూ ఇంకా ప్రారంభం కాని భవనంలో ఇలా జరిగిందేమిటి అని చర్చిస్తున్నారు.

English summary
Bandi Sanjay stated that it is unfortunate that there was a fire accident in the new secretariat. Bandi Sanjay expressed his impatience that this situation has arisen due to poor quality of work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X